ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వర్సెస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ అదే పార్టీకి వ్యతిరేకంగా చాలాకాలం నుంచి గళం విప్పుతున్న సంగతి కూడా తెలిసిందే. వరుసపెట్టి రఘురామ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామపై వేటు వేయాలని వైసీపీ ఎంపీలు పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.


కానీ రఘురామ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఆగడం లేదు. బెయిల్ మీద బయటకొచ్చి, ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి చూస్తున్నారు. అలాగే తనపై ఏపీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దేశంలోని ఎంపీలు, సీఎంలకు లేఖలు రాశారు. ఈ క్రమంలోనే మరోసారి రఘురామ ఎంపీ పదవిని తొలగించాలంటూ వైసీపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.


అలాగే వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల లిస్ట్‌లో రఘురామ పేరుని తొలగించింది. డైరక్ట్‌గా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పలేదు గానీ, వెబ్‌సైట్‌లో పేరు మాత్రం తొలగించారు. దీనిపై కూడా రఘురామ వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. తనని బహిష్కరిస్తున్నట్లు చెప్పాలని లేదంటే, తనని ఇండిపెండెంట్‌గా గుర్తించాలని స్పీకర్‌ని కోరతానని అంటున్నారు. ఇలా రఘురామ, వైసీపీల మధ్య వార్ నడుస్తుంది.


అయితే ఒక ఎంపీ ఏ పార్టీలో చేరకుండా, విమర్శలు చేస్తున్నందుకే వైసీపీ గట్టిగా చర్యలు తీసుకునేందుకు చూస్తుంది. కానీ టీడీపీని నలుగురు ఎమ్మెల్యేలు వీడి వైసీపీకి వైపుకు వెళ్ళిన చంద్రబాబు ఏం చేయట్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి, చంద్రబాబుపై తీవ్ర విమర్శలే చేశారు. అయినా సరే టీడీపీ, ఆ నలుగురుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని కోరలేదు. అలాగే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించలేదు. గతంలో చంద్రబాబు, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీలోకి తీసుకొచ్చి  నలుగురుకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు డైరక్ట్‌గా వైసీపీలో చేరకుండా, జగన్‌కు మద్ధతిస్తున్నారు. అందుకే బాబు ఆ నలుగురుని ఏం చేయలేకపోతున్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: