దేశవ్యాప్తంగా కరోనా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదనే చెప్పాలి. ప్రపంచదేశాల్లో కెల్ల భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఘోరంగా వ్యాప్తి చెందింది. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదయ్యేవి.అలాగే మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు చాలా దారుణంగా పెరిగిపోయేవి. కాని గత కొన్ని రోజులుగా చూసుకుంటే కేసులు చాలా వరకు కూడా తగ్గుతున్నాయనే చెప్పాలి. ఇది ఒక రకంగా రాష్ట్రానికి సంతోషం కలిగించే విషయం.గతంలో కేసులు చాలా దారుణంగా నమోదయ్యేయి. కాని క్రమ క్రమంగా కేసులు తగ్గిపోతూ ఉండటం అనేది సంతోషకరమైన విషయం అని చెప్పాలి.


ఇక తాజాగా ఆంధ్రాలో కేసులు చూసుకున్నట్లయితే మొత్తం 6770 కరోనా వైరస్ పాజిటివ్  కేసులు నమోదవ్వడం జరిగింది.అంటే 6.7 శాతం ఉన్నట్టు తెలుస్తుంది.దాకా అలాగే మరణాల విషయానికి వస్తే గత 24 గంటల్లో మొత్తం 58 మరణాలు నమోదైనట్లు సమాచారం తెలిసింది.ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఆదివారం రోజున గడిచిన 24 గంటల్లో మొత్తం 1,02,876 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.ఇక ఇప్పటి దాకా చూసుకుంటే మొత్తం  11,940 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం జరిగింది.మొత్తం 12,492 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తం 85,637 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి.


ఇక మరణాలు చిత్తూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 7 మంది , పశ్చిమ గోదావరి జిల్లాలో 7 మంది,శ్రీకాకులం జిల్లాలో 6 మంది, అనంతపురలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో నలుగురు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ముగ్గురు, కృష్ణ జిల్లాలో ముగ్గురు,ప్రకాశం జిల్లాలో ముగ్గురు,విజయనగరంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు మరణించడం జరిగింది.ఇది పూర్తిగా కర్ఫ్యు వలనే అని స్పష్టంగా అర్ధమవుతుంది.ఇక ఈ రకంగా ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి అనేది తగ్గుముఖం పడుతుందని చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: