సాధారణంగా పెళ్లి అనగానే అమ్మాయి, అబ్బాయి చేసుకుంటారని అందరికి తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఆలా జరగడం లేదు. ఇక కొన్ని చోట్ల అమ్మాయిలు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తాజగా ఓ వింత వివాహం హర్యానాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్‌ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలిక మంచి మిత్రులు. ఇక వీరిద్దరూ జాజర్‌ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అయితే ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు.. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లే వాళ్ళు.

ఇక ఆలా 7 సంవత్సరాల స్నేహాం కాస్తా ప్రేమగా మారింది.. ఎలాగైనా ఒక్కటవ్వాలని అనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. పిల్లల మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక వాళ్ళ నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇది సమాజంలో ఆమోద యోగ్యం కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని వారికీ నచ్చజెప్పారు. కానీ... అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతలికీ వారి మాటలను ఒంటపట్టలేదు.

దీంతో యువతులిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి వెళ్లారు. ఇక ఇద్దరూ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలియని జాజర్‌ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ తరుణంలో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇక పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. ఇక యువతులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హాజరైయ్యారు. ఈ తరుణంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయని పేర్కొన్నారు. అయితే యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని అన్నారు. ఇక ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు వెల్లడించారు. ఇక ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్‌ కుమార్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: