కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యం లో పార్టీలు, వేడుకలు జరగడానికి వీలు లేదని ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.. అయిన కొందరు ప్రబుద్దులు వాటిని ఖా తర్ చేయకుండా పార్టీలు చేసుకుంటూ పోలీసుల చేతులకు పని చెబుతున్నారు.. హైదరాబాద్లో ఇలాంటి పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు అలాంటి వాటి పై కఠినంగా చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు జరగడం అమానుషం..


వివరాల్లొకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రం సమీపం లోని బాక్స్‌ కంటైనర్‌ ఫాంహౌస్‌ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఫాంహౌస్‌ లో మద్యం సేవిస్తూ డీజే శబ్దాల తో చిందులేస్తూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న పలువురు యువతీ, యువకుల ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. బాక్స్‌ కంటైనర్‌ ఫాంహౌస్‌ లో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వరుణ్‌ గౌడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్‌ లోని వివిధ కంపెనీల కు చెందిన సుమారు 70 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఈ పార్టీలో పాల్గొన్నారు..


పోలీసులకు సమాచారం అందగా రాత్రి 11 గంటల తర్వాత మెరుపు దాడులు నిర్వహించారు.. వరుణ్‌గౌడ్‌ పారి పోయాడు.  ముగ్గురు నిర్వాహకులు, 21 మంది యువతులు, 43మంది యువకులను అరెస్టు చేశారు. 47 మద్యం సీసాల ను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్‌ యజమాని భరత్‌ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడం తో సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది.. రేవు పార్టీని మించిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది  రేవు పార్టీయేనని పోలీసుల కు దొరకడం తో బర్త్ డే పార్టీ.. అంటున్నారని కామెంట్లు వస్తున్నాయి. మరి ఈ విషయం పై పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: