టీడీపీ మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆయన సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా కరోనా సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవద్దని జగన్ సర్కార్ తో ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. అలాగే తమ పార్టీని బలపరిచడానికి ఆయన బాగా కృషి చేస్తున్నారు.


ప్రతి అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటూ ఆయన బలమైన రాజకీయ నేతగా అవతరించేందుకు విశ్వ ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలన పూర్తి చేసిన సమయంలో కూడా నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పాలనలో గడిచిన రెండేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆంధ్ర ప్రదేశ్ అధికారిక కరోనా మరణాల గణాంకాల పై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.



"భవిష్యత్తులో నష్టపరిహారాలు తిరస్కరించడానికి వైయస్సార్సీపి ప్రభుత్వం సిగ్గులేకుండా కరోనా మరణాలను కప్పిపుచ్చుతోందని మేము మొదటి నుంచి చెబుతున్నాము. తాజా గణాంకాలు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ కరోనా మరణాల గురించి జగన్ సర్కార్ ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది," అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.



అంతేకాదు ఆయన తాజాగా విడుదలైన కరోనా అధికారిక, అనధికారిక లెక్కలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఒక సోర్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం 2021, మే నెలలో 103,745 మరణాలు నమోదయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 2,938 మరణాలు మాత్రమే సంభవించినట్టు వెల్లడించిందని ఈ డేటా లో పేర్కొనబడింది. అధికారిక లెక్కల కు 34 శాతం ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయని లోకేష్ షేర్ చేసిన డేటా లో కనిపించింది. అయితే ఈ గణాంకాల ఆధారంగా లోకేష్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: