సీఎం క్యాంపు కార్యాలయంలో 215వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం కొనసాగుతూ ఉంది. ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి 2021–22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ....ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనూహ్య పరిస్థితులు తలెత్తాయని అన్నారు. వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకోవడానికి కర్ఫ్యూ లాంటి నియంత్రణలు విధించామ‌ని చెప్పారు. ఆర్థిక వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిదని సీఎం అన్నారు. రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాలకన్నా అధికంగానే చేపట్టామ‌ని తెలిపారు. కాని కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. అగ్రి ఇన్‌ఫ్రా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో బ్యాంకుల స‌మ‌ర్థ‌త పెర‌గాల్సి ఉంద‌న్నారు. 

స్కూళ్లు, ఆస్పత్రులను ప్ర‌స్తుతం అభివృద్ధి చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. అంతే కాకుండా నాడు – నేడు కింద పనులు చేపట్టామ‌ని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగంలోనూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టామ‌ని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం తీసుకు వచ్చామ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.  సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌కూడా చేశామ‌ని చెప్పారు. తామ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రెండో దశ కింద నాడు నేడు పనులు చేపట్టి స్కూళ్లను బాగు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

ఈ స‌మావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, సాంఘిక సంక్షేమశామ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్‌ అరుణ్‌కుమార్‌, సెర్ప్ సీఈఓ, పి రాజాబాబు, ఎస్‌ఎల్‌బీసీ, ఏపీ, కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్‌ కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతే కాకుండా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్, ఆర్‌బీఐ జీఎం, యశోధా భాయి ఈ స‌మావేశయంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజ‌ర‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: