అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ర‌క్తం విలువేంటో అంద‌రికీ తెలుస్తుంది. మ‌నిషిని బ్ర‌తికించాలంటే ర‌క్తం ప్రాముఖ్య‌త అంత‌లా ఉంటుంది మ‌రి. కానీ ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ర‌క్తం నిల్వ‌లు విప‌రీతంగా త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, కాన్పుల‌ప్పుడు, ఇత‌ర ఆపరేషన్లు స‌మ‌యంలో క‌చ్చితంగా రక్తం అవ‌స‌రం ఉంటుంది.

అయితే  ఇప్పుడున్న‌ బ్లడ్‌ బ్యాంక్ కేంద్రాలు దాతల నుంచి రక్తం సేకరించి వాటిని అవ‌స‌రం ఉన్న‌వారికి అంద‌జేస్తారు. అయితే ఇప్పుడున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీ కీల‌కంగా ప‌నిచేస్తోంది. దాదాపు జిల్లాకు అవ‌స‌ర‌మైన రక్తంలో సుమారు 60శాతం సేకరించి ఆదుకుంటోంది. రక్తం సేకరించడానికి నిత్యం రక్తదాన శిబిరాలను నిర్వ‌హిస్తోంది. రక్తదానం చేసే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది.

కానీ చాలా మంది యువ‌త ర‌క్తం ఇవ్వ‌డానికి ముందుకు రావ‌ట్లేదు. ఈక‌రోనాకు భ‌య‌ప‌డి ర‌క్తం ఇవ్వ‌ట్లేదు. అయితే ఈ విధంగా ర‌క్తం కొర‌త రావ‌డంతో చాలా బ్ల‌డ్ బ్యాంకులు మూసివేసే ప‌రిస్థితి వ‌స్తోంది. ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలోని బ్ల‌డ్ బ్యాంకుల్లో నిత్యం శిబిరాలు నిర్వహిస్తున్నప్ప‌టికీ.. ప్రజలు మాత్రంక క‌రోనాకు భ‌య‌ప‌డి ముందుకు రావ‌ట్లేదు.

దీంతో రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత తీవ్రం ఉంటుంది. బ్యాంకుల్లో పాజిటివ్‌ గ్రూపుల రక్తం అందుబాటులో కొద్దిగా ఉంటోంది. కానీ ఓ నెగెటివ్‌, ఎ నెగెటివ్‌ గ్రూపుల రక్తం అస్స‌లు దొర‌క‌ట్లేదు. అయితే రెడ్‌క్రాస్‌ సంస్థ  రక్తదాతలకు బ్లడ్‌ గ్రూపుతో పాటు వివిధ రకాల పరీక్షలు చేసి రిపోర్టులు ఫ్రీగా అంద‌జేస్తోంది. దీంతో పాటే జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ డోనర్‌కార్డు సైతం ఇస్తూ ఎంక‌రేజ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువసార్లు రక్తదా నం చేసిన కలెక్టర్‌, గవర్నర్ సంత‌కాల‌తో కూడిన ప్రశంసాపత్రాలు అందజేస్తూ ప్రోత్స‌హిస్తోంది. అయితే రక్తదానం చేయడంపై చాలామందికి అనుమానాలున్నాయి. కాక‌పోతే ర‌క్త‌దానం చేస్తే ఆరోగ్యానికి మంచిదే తప్ప ఎలాంటి నష్టం ఉండద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 18నుంచి 60ఏళ్ల లోపు  45కిలోల పైన బరువు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ నిర్భ‌యంగా రక్తదానం చేస్తే మ‌రింత ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: