న్యూఢిల్లీ: దేశంలో వైరస్‌లు అల్లక్లలోల్లం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజుల వరకు కరోనా మహమ్మారితో పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యనిపుణులు తలలు బద్దలుకొట్టుకున్నారు. ఎట్టకేలకు కరోనా ఓ కొలిక్కి వస్తుందని అనుకునే సమయానికి బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది కూడా ప్రాణాంతకం అని తెలియడంతో ప్రజల భయం మరింత పెరిగింది. దీనపై వెంటనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం దీనిని నిర్మూలించేందుకు అనేక జాగ్రత్తలు పాటించడంతో పాటు సంబంధిత మార్యదర్శకాలను జారీ చేసింది. దానికి తోడు ఇది కరోనా తగ్గిన వారిపై ఎక్కు వ్రభావం చూపుతుండటం ప్రజల్లో గుబులును అధికం చేస్తూ వచ్చింది.

దీనిపై స్పందించిన వైద్యులు ఇది ప్రాణాంతకమే అయినప్పటికీ తొలి దశలో చికిత్స అందిస్తే నయం అవుతుందని, ఆలస్యం చేస్తే కనుచూపు పోతుందని, అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని తెలిపారు. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. దీని ద్వారా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు కావలసిన ‘ఆంఫోటెరిసిన్-బి’ ఇంజక్షన్‌ను దిగుమతి చేయించారు. కానీ దీని ఖరీదు ఎక్కువగా ఉండటంతో దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురాలేక పోయింది. అయితే ప్రస్తుతం దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా రసాయన, ఫెర్టిలైజర్ కేంద్ర మంత్రి దేవేగౌడ సదానంద దీనిపై స్పందిస్తూ. బ్లాక్ ఫంగస్‌ నివారణకు వినియోగించే ‘ఆంఫోటెరిసిన్-బి’ ఇంజక్షన్లను దాదాపు 1,06,300 వయల్స్‌ను అన్ని రాష్ట్రాలకు పంచనున్నట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్‌ నిర్మాలనకు ఈరోజే మరో 53 వేల వయల్స్‌కు కూడా ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. ఇంజక్షన్‌లు కావలసిన మొత్తంలో ఉన్నందున ఈ వయల్స్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా మరో 53 వేల వయల్స్ కూడా రాష్ట్రాలకు పంపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా దేశంలో బ్లాక్ ఫంగస్‌ను అడ్డుకోవడం సులభతరం అవుతుందని, త్వరలోనే మరిన్ని వయల్స్ రాష్ట్రాలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని సదానంద తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: