ఏపీలో సీఎం జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమం లోనే ఇక డ్రైవింగ్ వృత్తిని నమ్ముకొని జీవనం గడిపేవారు అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ వాహన మిత్ర అనే పథకాన్ని ప్రవేశ పెట్టి సంచలనం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ఆటో, టాక్సీ, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు అందరికీ వైయస్సార్ వాహన మిత్ర అనే పథకం ద్వారా ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.



 అయితే ఈ పథకం లో భాగం గా ఇప్పటికే రెండు విడుతల సహాయాన్ని అందించింది ప్రభుత్వం. ఈ క్రమం లోనే ఇక కొత్తగా  దరఖాస్తు చేసుకున్న లబ్ధి దారులు అందరికీ కూడా వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద పది వేల రూపాయలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.  ఈ క్రమం లోనే రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ఆటో, టాక్సీ, మాక్సి, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రేపు పదివేలు జమ  చేయనుంది ప్రభుత్వం.



 ఈ ఏడాది 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు ఇటీవలే ప్రభుత్వం తెలిపింది. అయితే ఇక లబ్ధిదారులు అందరు ఖాతాలో 10000 రూపాయలు జమ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 248.46 కోట్లు రూపాయలను కేటాయించింది. వాహనదారులు ఆర్థిక సమస్యల తో ఇబ్బంది పడ కూడదనే ఉద్దేశం తో వాహనాల మరమ్మత్తు, భీమా ఖర్చుల కోసం గత ఏడాది నుంచి జగన్ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుండగా..  రేపు వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద  మూడో విడత సాయాన్ని అందుకో నున్నారు లబ్ధిదారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: