గత ఏడాది కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయ్. ముఖ్యంగా కరోనా వైరస్ కేసుల విషయంలో మరణాల విషయంలో ప్రభుత్వం అసలు నిజాలు దాస్తోంది అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక హైకోర్టు సైతం తెలంగాణ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కేసులు, మరణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించాలి అంటూ ప్రభుత్వానికి పలుమార్లు ఆదేశించింది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిలో సంభవించిన మరణాల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.



 కరోనా వైరస్ బారిన పడిన చాలామంది ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి వచ్చారు. కొంతమంది కార్పోరేట్ ఆసుపత్రిలో చేరితే మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఇటీవలే కరోనా మరణాల విషయంలో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఏది నిజమో ఏది అబద్దమో నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి.  ప్రభుత్వం బులిటెన్ లో చూపించిన వివరాలు వాస్తవానికి ఎంతో దూరంగా ఉన్నాయి.  జీహెచ్ఎంసీ పరిధిలో  వైరస్ బారినపడి మృతి చెందిన వారు 3900.. కానీ ఇప్పటివరకు ఏకంగా జిహెచ్ఎంసి పరిధిలో ఏకంగా 30 వేల డెత్ సర్టిఫికెట్లు జారీ కావడం సంచలనం గా మారిపోయింది.



 అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య మూడు రెట్లు అధికంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ ఏప్రిల్ నాలుగో వారం నుంచి భారీగా  వైరస్ మరణాలు సంభవించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే జిహెచ్ఎంసి పరిధిలో సంభవించిన కరోనా మరణాలు 3,900 అని అటు బులిటెన్ లో చెబుతూ ఉంటే.. ఇప్పటివరకు ఏకంగా 30 వేల వరకు కరోనా వైరస్ మరణాలకు సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేయడం గందరగోళ పరిస్థితికి కారణం అవుతుంది. ఇక ఇందులో 90 శాతం ఆసుపత్రిలో సంభవించిన మరణాలు అయితే ఇక మిగతా 10 శాతం ఇళ్లలో సంభవించిన మరణాలు.  దీంతో ఇక కరోనా మరణాల్లో ఇంతటి గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: