ఏపీలో విద్యుత్ ఉద్యోగుల‌కు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2018 పీఆర్సీ ప్ర‌కార‌మే జీతాలుంటాయ‌ని బాలినేని స్ప‌ష్టం చేశారు.విద్యుత్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది లేద‌ని...2022 వరకు ఇవే జీతాలు కొనసాగుతాయ‌ని తెలిపారు.ఉద్యోగులకు న్యాయమే చేస్తాం త‌ప్ప అన్యాయం చేయ‌మ‌ని... బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాల‌ను ఉద్యోగులెవ‌రు న‌మ్మోద్ద‌ని చెప్పారు.క‌రోనా వ‌ల్ల అనేక మంది ఉద్యోగులు చ‌నిపోయార‌ని వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం అందిస్తామ‌ని తెలిపారు.రెండు నెలల్లో ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామ‌ని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. కోవిడ్ బారిన పడిన విద్యుత్ ఉద్యోగుల ఆస్పత్రి బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంద‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో 80వేల కోట్లు అప్పుల్లో విద్యుత్ రంగాన్ని ఉంచార‌ని..సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయ‌లు ఇప్పుడు కేటాయించార‌ని తెలిపారు.క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆస్ప‌త్రుల్లో 24 గంట‌లూ విద్యుత్ అందించేలా సిబ్బంది బాగా ప‌ని చేశార‌ని బాలినేని ప్ర‌శంసించారు.ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులంద‌రికి అభినందనలు తెలియ‌జేశారు. జీతాలకు సంబంధించిన ఎటువంటి లెటర్ త‌న ద‌గ్గ‌ర‌కు రాలేద‌ని...ఉద్యోగుల‌కు ఎలాంటి సందేహం ఉన్న నేరుగా క‌ల‌వ‌చ్చ‌ని సూచించారు.


రాష్ట్రంలో వ్య‌వ‌సాయ మీట‌ర్ల‌పై ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తున్నాయ‌ని మంత్రి బాలినేని అన్నారు.విద్యుత్ మీట‌ర్ల వ‌ల్ల రైతుల‌పై ఎలాంటి భారంప‌డ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ఎంతవరకు వినియోగం జరుగుతుందో తెలుసుకునేందుకే మీటర్లు పెడుతున్నామ‌ని తెలిపారు.రైతులకు పగలే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను సిఎం అందిస్తున్నారని అందుకోసం 1700కోట్ల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు.అనంతపురం జిల్లాలో రాత్రి పూట కరెంటు ఇవ్వాలని రైతులు కోరుతున్నార‌ని అక్క‌డ రైతుల‌కు  మాత్రం పగలు సగం, రాత్రి సగంవిద్యుత్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని మంత్రి బాలినేని స్ప‌ష్టం చేశారు.జగనన్న కాలనీలకు సంబంధించి విద్యుత్ వర్కు జరుగుతుంద‌ని...డీపీఆర్  పూర్తి కాగానే టెండర్లు ను పిలుస్తామ‌న్నారు. ఇప్ప‌టికే శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయ‌ని తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: