క‌రోనా రెండ‌వ ద‌శ‌లో ఏపీలో కేసులు విప‌రీతంగా పెరిగాయి.వీటితో పాటు మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గా సంభ‌వించాయి. అయితే క‌రోనా రెండ‌వ ద‌శ‌ను ఎదుర్కొవ‌డంలో అధికారులు విఫ‌ల‌మైయ్యార‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి.రెండ‌వ ద‌శ‌లో ఆక్సిజ‌న్  అంద‌క చాలా మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు.అయితే ఆ త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ నిల్వ‌సామ‌ర్ధ్యాన్ని పెంచింది.తాజాగా ఇప్పుడు థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుగానే అప్ర‌మ‌త్త‌మైంది.రాష్ట్రంలో ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు, థ‌ర్డ్‌వేవ్‌, హెల్త్ ప‌బ్స్ ఏర్పాటుపై సీఎం జ‌గన్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.థ‌ర్డ్‌వేవ్ ప్ర‌భావం చిన్న‌పిల్ల‌ల‌పైనే ఎక్కువ ఉంటుంద‌న్న నిపుణుల హెచ్చ‌రిక‌ల‌తో  చిన్నారుల వైద్యం పై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రాల్లో హెల్త్ ప‌బ్స్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

ఇదిఇలా ఉంటే ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని సీఎం జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు.జూన్‌ 6 నుంచి 12 వరకూ... వారంరోజుల డేటాను సీఎంకు వివ‌రించారు.మే 16న 25.56 శాతంగా ఉన్నపాజిటివిటీ  రేటు జూన్ 12 నాటికి 6.58 శాతానికి త‌గ్గింద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు.అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5శాతం లోపే ఉంద‌ని...ఏడు జిల్లాల్లో 0-9 శాతం పాజిటివిటీ రేటు ఉంద‌ని పేర్కొన్నారు.ఆరు జిల్లాల్లో 10 నుంచి 19 శాతం పాజిటివిటీ రేటు ఉంద‌ని వివ‌రించారు.ఇటు రాష్ట్రంలో యాక్టీవ్ కేసులు సంఖ్య కూడా భారీగా త‌గ్గింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 85,637 యాక్టీవ్ కేసులు మాత్ర‌మే ఉన్నారు.రిక‌వ‌రీ రేటు 94.61 శాతానికి చేరుకుందని అధికారులు వెల్ల‌డించారు. 104 కాల్‌ సెంటర్‌కు ఏప్రిల్‌ 15 నుంచి 5 లక్షలకుపైగా కాల్స్ వ‌చ్చాయ‌ని 6,41,093 ఔట్‌ గోయింగ్‌కాల్స్‌ వెళ్లాయయ‌ని అధికారులు సీఎంకు తెలియ‌జేశారు.ప్రస్తుతం రోజువారీ కాల్స్‌ సుమారు 2700 కు చేరాయ‌ని వివ‌రించారు.రాష్ట్రంలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు 2303 కేసులు న‌మోద‌వ్వ‌గా 157 మంది మృతి చెందిన‌ట్లు సీఎంకు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: