నైరుతి రుతుపవనాలు, ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయ్. తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు రాష్ట్రమంతటా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తొలకరి చినుకు కోసం ఎదురు చూసిన రైతాంగం మొత్తం ప్రస్తుత వర్షాలతో  పంట సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోసారి మట్టిలో చెమట చిందించేందుకు రైతాంగం వ్యవసాయ క్షేత్రం లోకి అడుగుపెట్టింది.




 భారీ వర్షాల కారణంగా పంట పొలాలు మొత్తం పూర్తిగా నీటితో నిండి పోయాయ్. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం రైతులందరూ తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అటు అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరికి కరెంట్ షాక్ కి గురి అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు . ఈ క్రమంలోనే ఇక రైతాంగానికి ఇటీవలే విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు   . వర్షాల కారణంగా పొలం లో ఉండే కరెంటు మీటర్ లు,  స్టాటర్లు కూడా పూర్తిగా తడిసిపోయి ఉంటాయని ఇక బోర్ మోటార్ ఆన్ చేసేటప్పుడు రైతులందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.



 అంతేకాకుండా ఇంటి సర్వీస్ వైర్ వేలాడే ఇనుప తీగలను, స్తంభాలను కూడా అసలు ముట్టుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం తడి చేతులతో స్విచ్ వేయడం లాంటివి అసలు చేయవద్దు అని సూచిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పంట పొలాల్లోకి బోరు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతాంగ మొత్తం ప్రస్తుతం అప్రమత్తంగా ఉండడం ఎంతో మేలు అంటూ సూచిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఇదిలా ఉంటే ఓవైపు గ్రామాల్లో వర్షాల కారణంగా రైతాంగం మొత్తం సంతోషంలో మునిగిపోతే అటు నగరాల్లో  ఉన్న ప్రజానీకం జనావాసాల్లోకి నీరు చేరి  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: