పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన అధికార అందలాలు ఏవీ అందుకోలేదు. తనకు అభిమానుల ప్రేమ ముందు పదవులు పెద్ద లెక్కలోకి రావు అని పవన్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి రాజయోగం ఉందని ఒక వైపు జాతకాలు చెబుతున్నాయి. ఆయన ఏదో నాడు అధికారాన్ని అందుకుంటాడని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే పవన్ కి మాత్రం ఇపుడే రాజయోగం పట్టేలా సీన్ కనిపిస్తోంది.

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు తావిస్తోంది. గత మూడేళ్ళుగా కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చోటు లేదు. 2018లో తెలుగుదేశం కేంద్ర సర్కార్ నుంచి బయటకు వచ్చేశాక మళ్ళీ ఏపీ నుంచి ఎవరూ కేంద్ర మంత్రులు కాలేదు. ఈ నేపధ్యంలో త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఏపీకి ప్రాతినిధ్యం కచ్చితంగా ఉండాలని బీజేపీ అభిప్రాయపడుతోందిట. ఏపీలో బీజేపీకి ఎంపీలు ఎవరూ లేరు. రాజ్యసభలో మాత్రం ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారు టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరిన వారు. వారి సభ్యత్వం వచ్చే ఏడాదితో ముగుస్తోంది.

దాంతో  ఏపీలో చూస్తే బీజేపీ తరఫున‌ జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఆయన యూపీ కోటాలో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఇపుడు బీజేపీలో వినిపిస్తోంది. జనసేనకు బీజేపీకి మధ్యన పొత్తు ఉంది. పైగా పవన్ చరిష్మాటిక్ సినిమా హీరో. ఆయన ఒక బలమైన సామాజికవర్గానికి చెందినవారు. దాంతో పవన్ కి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇస్తే ఏపీలో బీజేపీ జనసేన కూటమి పుంజుకుంటుంది అన్న ఆలోచన కమలం పార్టీ పెద్దలు చేస్తున్నారుట.

దీని వెనక  ఏపీకి చెందిన ఒక ఆరెస్సెస్ కీలక నేత కూడా ఉన్నారట. ఆయనే బీజేపీలో ఉన్నపుడు పవన్ ని  కమలం పార్టీతో పొత్తులకు ఒప్పించారు అన్న మాట కూడా ఉంది. ఇపుడు మరోసారి జోక్యం చేసుకుని పవన్ని ముందు పెడితే ఏపీలో కూటమికి బలం వస్తుంది. వైసీపీకి బలమైన ఆల్టర్నేషన్ గా ఉంటుంది అని గట్టిగా చెబుతున్నారుట. ఏపీలో బలపడాలని ఆలోచిస్తున్న బీజేపీ పవన్ ని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకుంటోందిట. మొత్తానికి అదే కనుక నిజమైతే పవన్ సెంట్రల్  మినిస్టర్ అయినట్లే. ఆయన ఇన్నేళ్ళ రాజకీయ పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కినట్లే అంటున్నారు.











మరింత సమాచారం తెలుసుకోండి: