ఏపీలో వారసత్వ రాజకీయాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. నేతలు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్‌లో పెట్టాలని చూస్తుంటారు. ఇప్పటికే చాలామంది నాయకులు వారసులు ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే పలువురు టీడీపీ సీనియర్లు తమ వారసులని బరిలో దింపారు. జగన్ వేవ్‌లో టీడీపీ వారసులు ఓటమి పాలయ్యారు.


అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకొందరు సీనియర్లు తమ వారసులని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే వారు వారసులని బరిలో దింపాలని చూశారు. కానీ చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అనడంతో కొందరు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని పోటీకి దించారు. కానీ కొందరు మాత్రం వారే స్వయంగా పోటీలోకి దిగారు.


ఈసారి మాత్రం అలా జరగకుండా తమతో పాటు తమ వారసులకు టిక్కెట్లు దక్కించుకునేలా చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో వారసులనే లైన్‌లో పెట్టాలని అనుకుంటున్నారు. అలా వారసులని రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నవారిలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముందు వరుసలో ఉంటారు. అయ్యన్న వారసుడు చింతకాయల విజయ్ కొన్నేళ్ళ నుంచి టీడీపీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ప్రయత్నించారు గానీ వర్కౌట్ కాలేదు. దీంతో అయ్యన్న ఒక్కరే పోటీలో దిగారు. ఈ సారి మాత్రం తనతో పాటు తన కుమారుడుకు సీటు తెచ్చుకోవాలని అయ్యన్న చూస్తున్నారు.


అటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిది సైతం అదే మార్గంలో ఉన్నారు. తన కుమారుడు అప్పలనాయుడుని ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి దించాలని చూస్తున్నారు. ఒకటే టిక్కెట్ అని రూల్ పెడితే తాను సైడ్ అయ్యి, వారసుడుని బరిలో దించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అలాగే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మప్రసాద్‌ని సైతం రాజాం బరిలో నిలబెట్టాలని చూస్తున్నారు. మరి చూడాలి ఈ వారసులకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దొరుకుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: