అపర కుబేరుడు ఇండియాకి చెందిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ అదాని ఎంటర్ ప్రైజెస్ యజమాని గౌతం అదానికి సోమవారం భయంకరమైన గట్టి షాక్ తగిలింది.అదాని షేర్లు దారుణంగా పతనమయ్యాయి.ఇక స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోకపోయాయి. అందులో ప్రత్యేకించి అదాని కంపెనీల షేర్లు మాత్రం పాతిక శాతం వరకూ పడిపోయాయి. ఫలితంగా.. ఒక్క రోజులో 55 వేల కోట్లను గౌతం అదానీ కోల్పోయారు. ఇక ఇలా జరగడానికి ఒక కారణం ఉంది.


గౌతం అదాని ఈమధ్య కాలంలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు.కంపెనీస్ ని టేకోవర్ చేస్తున్నారు. అలాగే పోర్టుల్ని.. ఎయిర్ పోర్టుల్ని బాగా కొంటున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టారు. అయితే వాటికి పెట్టిన ఆ పెట్టుబడులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. అదాని గ్రూప్‌లో విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు ఫండ్స్‌ను తరలిస్తున్నాయి. ఇదంతా కూడా పెట్టుబడి రూపంలో జరుగుతోంది. ఫండ్స్ తరలిస్తున్న కంపెనీల సమాచారాన్ని అదాని గ్రూప్ రహస్యంగా ఉంచింది. నిబంధనల ప్రకారం ఖచ్చితంగా విదేశీ ఫండ్స్ సమాచారాన్ని వెల్లడించాలి. లేకపోతే ఆ ఫండ్స్ ని అందుకున్న వారి డి మార్ట్ ఖాతాల్ని నిలిపివేస్తారు.


ఇక అదాని గ్రూప్‌కు ఫండ్స్ మూడు విదేశీ కంపెనీల నుంచి వచ్చాయి. ఆ కంపెనీలకు మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌కు చెందిన ఒకేరకమైన అడ్రస్‌ ఉంది.ఇక వాటికైతే ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా లేవు. అంటే దీన్ని బట్టి బ్లాక్ మనీని ఇండియా నుంచి మారిషస్ తరలించి అక్కడ నుండి పెట్టుబడుల రూపంలో ఇండియాకు తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఫండ్స్ పంపిణీ చేస్తున్న కంపెనీల వివరాలు ఇవ్వకపోవడంతో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేసింది. ఇది పోయిన నెలలోనే జరిగింది.ఏది ఏమైనా కాని ఇది గౌతమ్ అదానికి పెద్ద షాక్ అనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: