ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా కుదిపేస్తోంది. అలాంటిది ఇది స‌రిపోన‌ట్టు ఇప్పుడు మరో ముప్పు కూడా త‌యారైంది. మంకీపాక్స్ అనే వైర‌స్ ఇప్పటికిప్పుడు కాక‌పోయినా.. భవిష్యత్ లో ఈ కొత్త ప్ర‌మాదం విరుచుకుపడే ఛాన్స్ ఉందని సైంటిస్టులు వివ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే యూకే లోని నార్త్ వేల్స్ లో మంకీపాక్స్ వైర‌స్‌కు చెందిన రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులు రెండూ వేల్స్ లో గుర్తించినా.. వేల్స్ నుంచి బయట జరిగి ఉండవచ్చని వేల్స్‌లోని స్థానిక ఆఫీస‌ర్లు వివ‌రిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ వ్యాధికి సంబంధించిన రోగులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇది ఎక్కడ నుంచి బ‌య‌ట ప‌డింది, ఎవ‌రికి సంక్రమించి ఉండొచ్చు అనే విష‌యాల‌తో పాటు వీరి వల్ల మరెవ‌రికైనా ముప్పు పొంచి ఉందా అనే విష‌యాల‌పై పరిశోధనలు చేస్తున్నారు. కాగా రోగుల నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఈ వైర‌స్ సంక్రమణ జ‌రిగే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ఆఫీస‌ర్లు వెల్ల‌డించారు.  

డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం మంకీపాక్స్ అంటే జూనోటిక్ వైరల్ వ్యాధిగా తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన జంతువుల నుండి మ‌నుషుల‌కు సోకుతుంది. దాని కేసులు చాలావరకు మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్యాలలో చాలా ఎక్కువ‌గా బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ వ్యాధి సోకిన జంతువు యొక్క రక్తం, చెమట లేదా లాలాజలం ఆధారంగా మ‌నుషుల‌కు ఈ వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉంది.

సైంటిస్టుల నివేదిక ప్రకారం మంకీపాక్స్ వైరస్ అనేది మశూచి సమూహానికి స‌మాద‌న‌మైనది. మంకీపాక్స్ వైర‌స్ లక్షణాలు మశూచి లాగే ఉంటాయ‌ని చెబుతున్నారు. చర్మం, జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పులతో పాటుగా అలసట అలాగే బొబ్బలు రావ‌డం దీని ల‌క్ష‌నాలు. యూకే ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం వ్యాధి సోకిన త‌ర్వాత ఒక‌టి నుండి 5 రోజుల తరువాత చర్మం మీద దద్దుర్లు కనిపిస్తాయి. ఇది దాని మొద‌టి లక్షణంగా గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: