దశాబ్దాలుగా మాన్సాస్ ట్రస్టు, సింహాచలం గుడి ఛైర్మన్ బాధ్యతలని గజపతి రాజుల ఫ్యామిలీ దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. మొదట పీవీజీ రాజు వీటికి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన మరణం తర్వాత, ఫ్యామిలీలో పెద్ద కుమారుడుగా ఆనంద గజపతిరాజు ఆ భాద్యతలు చూసుకున్నారు. ఆనంద గజపతిరాజు మరణించాక ఆ బాధ్యతలు అశోక్ గజపతిరాజుకు దక్కాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ట్రస్ట్‌ డీడ్‌ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ గజపతిని తప్పిస్తూ, సంచయితని మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఛైర్మన్‌గా నియమించారు.

ఇక దీనిపై అశోక్ కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దీనిపై కోర్టు తీర్పు ఇస్తూ, సంచయిత నియామకం చెల్లదని, వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోలని రద్దు చేసి, మళ్ళీ అశోక్ గజపతి రాజునే ఛైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇక వాస్తవ పరిస్తితులని చూస్తే అశోక్ గజపతి రాజుకు న్యాయం జరిగిందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. సంచయిత బ్యాగ్రౌండ్ ఎలా ఉన్నా సరే కుటుంబంలో పెద్ద వ్యక్తి అశోక్ ఉండగా, సంచయితకు బాధ్యతలు అప్పగించడం ముమ్మాటికి తప్పే అని అంటున్నారు. అసలు అశోక్‌ని తప్పించే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు వైసీపీ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతుంది.


అదే విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ...అశోక్‌ గజపతి రాజుని తప్పించి, సంచయితకు మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయాల బాధ్యతలని అప్పగించడం కరెక్ట్ కాదని, అలా చేస్తే తమ ప్రభుత్వమే అభాసుపాలు అవుతుందని, వైసీపీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా సరే వారు బొత్స మాట వినకుండా చేశారని, అందుకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: