మాన్సాస్ విషయంలో కోర్టు తీర్పు కాపీలు పూర్తిగా వచ్చిన తర్వాతే స్పందిస్తానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాము చేసింది న్యాయమేనని పేర్కొన్న ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు ఏమీ అభివృద్ధి చేశారు అని ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదని పేర్కొన్న వెల్లంపల్లి అభివృద్ధి కూడా చూడాలని అసలు ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జోక్యం అనేది లేదని స్పష్టం చేశారు. సొంత అన్న కూతురు చైర్మన్ అయితే అశోక్ గజపతి రాజు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇక మరో పక్క అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తిస్తున్నారని అన్నారు. టిడిపి హయాంలో అక్రమాలకు గురై దేవాదాయ శాఖ అధీనంలో నుంచి వెళ్లిపోయిన భూములను ఎందుకు గుర్తింపు లేదని ఆయన ప్రశ్నించారు. తాము ఈ పని చేస్తున్న అందుకే తెలుగుదేశం పార్టీలో భయం పెరిగిపోతోందని ఆయన ఆరోపించారు. ఇక మరో పక్క బొబ్బిలి దేవాలయ భూముల పై కూడా విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. దేవాలయ ఆస్తులు భూమి పరిరక్షణ కోసమే తప్ప రాజకీయం కోసం కాదని అన్నారు. అలాగే దేవాలయ భూముల పై తనతో చర్చించేందుకు బొబ్బిలి రోజులు ముందుకు వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

ఇక వాస్తవానికి మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు అన్న మొదటి భార్య కుమార్తె అయిన సంచైత గజపతిరాజును నియమిస్తూ కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి జీవో జారీ చేసింది. అయితే అయితే సంచైత తల్లి విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆమె నియామకం చెల్లదంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి. ఇక తన చైర్మన్ గిరీని తొలగించడంపై హైకోర్టుకు వెళ్లే అశోక్ గజపతిరాజుకి అనుకూలంగా నిన్ననే తీర్పు వచ్చింది. ఇక దీనికి సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: