ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతుంది హెచ్డిఎఫ్సి  ఇక తమ కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ బ్యాంక్. టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పుడు కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తీసుకు వస్తుంది. తమ కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఇప్పటికే ఎన్నో రకాల సర్వీసులను అందిస్తుంది.  కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో కూడా ఎంతో ఖచ్చితత్వంతో ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక ఇటీవల తమ కస్టమర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్ చేసింది.  ప్రస్తుతం హెచ్డిఎఫ్సి అందిస్తున్న కొన్ని రకాల బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది హెచ్డిఎఫ్సి.




 ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందిస్తున్న సర్వీసులలో ఒకటి మొబైల్ బ్యాంకింగ్. దీని కోసం కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అందుబాటులో ఉంది.  అయితే ఇటీవల హెచ్ డి ఎఫ్ సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో కొన్ని రకాల సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. అయితే మొబైల్ యాప్ తో కస్టమర్లకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముందుగానే దీనికి సంబంధించిన సమాచారం అందించారు. నెట్ బ్యాంకింగ్ యాప్ సేవల అంతరాయానికి చింతిస్తున్నాము అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇక ఈ సమస్యను పరిష్కరించేందుకు టీమ్ పని చేస్తుందని హెచ్డిఎఫ్సి కమ్యూనికేషన్ టీం తెలిపింది.



 కస్టమర్లు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ సూచించింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. బ్యాంకు కస్టమర్లందరూ ఈ అంతరాయానికి మరణించి తమకు సహకరించాలని సూచించింది. ఇక ఈ సమస్య పరిష్కారం అయిన వెంటనే అటు మళ్లీ సోషల్ మీడియా లో అప్డేట్ ఇస్తామంటూ హెచ్డిఎఫ్సి కమ్యూనికేషన్ టీం తెలిపింది. ప్రస్తుతం ఎక్కువగా మొబైల్ నెట్ బ్యాంకింగ్ యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతూ ఉన్నారు నేటి రోజుల్లో. ఇక ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో కస్టమర్లు కాస్త అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: