చిలకలూరిపేట శాసనసభ్యురాలు, వైసీపీ మహిళా నాయకురాలు విడదల రజినీ చాలా చురుకుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా సమయంలోనూ ప్రజల సమస్యలను తీర్చేందుకు ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో గల లబ్ధిదారులకు దగ్గరుండి మరీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారు. ఈ రోజు ఆమె చిలకలూరిపేట నియోజకవర్గంలోని 1170 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా మంజూరైన రూ. 1 కోటి 17 లక్షలు విలువైన చెక్కును అందజేశారు.



ఐతే వాహన మిత్ర ద్వారా లబ్దిపొందిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయగా.. వారితో పాటు విడదల రజిని కూడా జగన్ ఫోటో కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె కొద్ది దూరం పాటు ఆటో కూడా నడిపారు. ఆమె డ్రైవర్ షర్ట్.. అనగా ఖాకీ చొక్కా ధరించి.. మహిళా కౌన్సిలర్లు అందరిని ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం పాటు నడిపారు. నిజానికి విడుదల రజిని ఆటో నడపడం ఇదేం మొదటిసారి కాదు. 2019 వ సంవత్సరం లో చిలకలూరిపేట లో జరిగిన ఆటో ర్యాలీ లో ఆమె పాల్గొని.. కొంత దూరం పాటు ఆటో నడిపారు.

ఇకపోతే ఈరోజు సీఎం జగన్ వాహనమిత్ర పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాహనమిత్ర పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2లక్షల 48వేల లబ్ధిదారులు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుకున్నారు. తాజాగా ఇచ్చిన పదివేల ఆర్థిక సహాయంతో ఇప్పటివరకు లబ్ధిదారులు రూ.30,000 తీసుకున్నట్లు అయ్యింది. ఈ రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజిని  చిలకలూరిపేటలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన కోవిడ్ 19 అవగాహన - పోషకాహార ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవగాహన ఎంతో ముఖ్యం అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: