న్యూఢిల్లీ: కరోనా చేసే పోరాటంలో ప్రతి దేశం కూడా వ్యాక్సిన్‌నే నమ్ముకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలో కూడా ఇటీవల కొన్ని వ్యాక్సిన్‌లకు అనుమతులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న వాటిలో ఆస్ట్రాజెనికా బాగా పనిచేస్తుందని సంస్థ వారు అన్నారు. అయితే తాజాగా ఆస్ట్రాజెనికా యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్సపై పరిశోధనలు చేశారు. కరోనాపై దీని చికిత్స అంతగా పనిచేయడం లేదని, కరోనా నివారణలో దీని ప్రభావం అంతగా లేదని పరిశోధకులు తెలిపారు. కరోనాపై ఇది కేవలం 33 శాతం ప్రభావమే చూపింది. ఈ ఫలితం వచ్చిన వ్యాక్సిన్‌ పరిగణలోకి తీసుకునేది కాదు. అంటే కరోనాపై పోరాటంలో ఆస్ట్రాజెనికా విఫలమయినట్టే.


దీనిని ప్లాసెబో చికిత్సతో పోలిస్తే ఏజడ్‌డీ 442 మంది కరోనా రోగుల్లో కేవలం 33శాతం మందికి మాత్రమే లక్షణాలు అభివృద్ది కాకుండా ఉన్నాయి. దీంతో ఈ వ్యాక్సిన్ ప్రాథమిక ఎండ్ పాయింట్‌ను అందుకోలేక పోయిందని, కాబట్టి ఇది విఫలమయిందని ఆస్ట్రాజెనెకా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మేన్ పంగలోస్ అన్నారు. అయితే కరోనా సోకిన వారికి ప్రథమంగా ఈ చికిత్స చేయడం ద్వారా వారిలో వ్యాధి తీవ్రతను తగ్గించాలని తమ సంస్థ ప్రయత్నించిందని, కానీ కరోనాపై ఈ చికిత్స అంతగా ప్రభావం చూపలేదని పంగలోస్ అన్నారు. సాధారణంగా యాంటీబాడీ చికిత్స అనేది శరీరంలోని యాంటీబాడీలను ప్రేరేపించి వ్యాధితో పోరాడేలా చేస్తుంది. అలా చేయడంలో ఆస్ట్రాజెనికా విఫలమయిందని ఆయన చెప్పారు.


 మోనోక్లనాల్ యాంటీబాడీ థెరపీని రైవల్స్ రీజెనేరన్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ (ఆర్ఈజీఎన్.ఒ), ఇలీ లిల్లీ అండ్ కొ (ఎల్ఎల్‌వై.ఎన్) సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ పద్దతిని అమెరికాలోని కరోనా రోగులకు అందించేందుకు అనుమతి లభించింది. అలాగే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) కూడా దీనికి అనుమతులు ఇచ్చింది. దీని తయారీకి అమెరికా మద్దతు ఇస్తుంది. దాదాపు 5 లక్షల డోసుల ఏజడ్‌డీ7442ను అమెరికాకు అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఈ సంవత్సరం మార్చిలోనే ఆస్ట్రాజెనికా ప్రకటించింది. దీంతో నూతన అధ్యయనంలో వచ్చిన ఫలితాలు ఆస్ట్రాజెనికాకు ఎదురుదెబ్బే అవుతుంది. కానీ ఈ ఔషధం మరిన్ని పరిశోధనలు చేస్తే మరింత స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఓ నిర్ణయానికి రావడానికి వీలు లేదని పరిశోధకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: