న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు రాష్ట్రాలు అనేక ప్రయత్నాలు చేసి చివరిగా లాక్‌డౌన్‌ను విధించాయి. దాంతో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధులను సడలించేందుకు ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సడలింపులను ప్రకటించాయి. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల తరుణంలో రాష్ట్రాలు తీసుకోనున్న నిర్ణయాలు సమంజసమేనా..? అన్న సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఈ సందర్భంగా లాక్‌డౌన్ సడలింపులపై నిపుణులు స్పందించారు.


కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు బాగా నష్టపోయిన రాష్ట్రాల్లో ముంబై కూడా ఒకటి. దేశానికి ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై తీసుకున్న కఠిన చర్యలే కరోనాను అడ్డుకున్నాయి. అటువంటిది ఇప్పుడు కరోనా కాస్త తగ్గడంతో తిరిగి యథావిధికి రావాలని చూడటం సరికాదని నిపుణులు అంటున్నారు. కరోనా థర్డ్ వేవ్ రానుందని ఒకవైపు నిపుణులు చెబుతున్నా రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలించేందుకే మొగ్గుచూపుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ మరికొన్నాళ్లు కొనసాగించాలని వారు చెబుతున్నారు. అప్పుడే కరోనాను అడ్డుకోవడం మరింత సులభతరం అవుతుందని తెలిపారు.



కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను సడలిస్తే మరింత ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తేయడంతో ప్రతిఒక్కరు షరామామూలుగా తిరుగుతారు. దానివల్ల కరోనా మరింత బలోపేతం అవుతుందని, ఒకవేళ అదే సమయంలో థర్డ్ వేవ్ వస్తే పరిస్థితులు చేజారిపోతాయని, చిన్నపిల్లలకు, పెద్దవారికి ఒకే సారి వైద్యం చేయడం కష్టమని, దాని కారణంగా ఔషధాల కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూను మరో 6నెలల పాటు కొనసాగించాలని, ఇంకా కుదిరితే మరో ఏడాది పాటు ఈ నిబంధనలు పాటించాలని వారు అంటున్నారు. మరి రాష్ట్రాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: