ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. తమ పార్టీ తరుపున ఎంపీగా గెలిచి, తమ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న రఘురామ చాప్టర్ క్లోజ్ చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. అందుకే మొదట ఆయన ఎంపీ పదవిపై వేటు వేయించాలని వైసీపీ చూస్తుంది.


ఇప్పటికే రఘురామపై పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయాన్నే వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మరోసారి చెప్పారు. రఘురామపై అనర్హత వేటు ఖాయమని, ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజుగారిని డిస్ క్వాలిఫై చేయడం ఖాయమని అంటున్నారు.


అలాగే దమ్ముంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ని చూసి, రఘురామ పౌరుషం తెచ్చుకుని ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భరత్, రఘురామకు ఇచ్చిన కౌంటర్లలో ఎలాంటి తప్పు లేదని, కానీ టీడీపీని వీడి వైసీపీ వైపుకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తే బాగుంటుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.


రాజుగారు వేరే పార్టీలోకి వెళ్లలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని చెబుతున్నారని, కానీ టీడీపీని వీడిన ఎమ్మెల్యేలు జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా ఉన్నారని, అలాగే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, కాబట్టి వారిని డిస్ క్వాలిఫై చేయాలని అడుగుతున్నారు.


అయిన తమ పార్టీలోకి వచ్చేవారు రాజీనామా చేసి రావాలని రూల్ పెట్టుకున్న జగన్, ఇంతకాలమైన టీడీపీ ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. రాజుగారు లాగానే నలుగురు ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అలాంటప్పుడు వారు కూడా పదవులకు రాజీనామా చేస్తే బెటర్ అని అంటున్నారు. మొత్తానికైతే ఈటల ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపై గట్టిగానే పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: