కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో విలవిల్లాడిన భారత్ గత కొన్ని రోజులుగా కొంచెం కొంచెం కోలుకొంటూ ఊపిరి తీసుకుంటోంది. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే ఇక ఈ సెకండ్ వేవ్ లో ఎన్నో ప్రాణాలు బలి తీసుకున్న కరోనా ఇప్పుడున్న క్రమంలో తగ్గుతున్న కరోనా కేసులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో చూసుకున్నట్లతే గత 24 గంటల్లో కొత్తగా 60,471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 9,13,378 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకూ 3,77,031మంది కరోనా మహమ్మారితో మృతి చెందారు. ఇక రోజువారీ కరోనా కేసులు చాలా తక్కువ అవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఇంకా  కరోనా వైరస్‌ బారినపడి మరో 2,726 మంది మరణించారని తెలిపింది.


ఇక తాజాగా నమోదైన కరోనా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. ఇక ఇందులో మొత్తం 2,82,80,472 మంది కోలుకోవటం సంతోషించాల్సిన విషయం అని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,77,031 మందికి కరోనా వైరస్ సోకి మృతి చెందగా.. ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టివ్‌ కేసులు మొత్తం 9,13,378 ఉన్నాయని ఆరోగ్య శాఖా తెలిపింది. ఇక అలాగే రోజు రోజుకు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో 25,90,44,072 డోసులు వేసినట్లు తెలిపింది. ఇక ప్రసుతం దేశంలో రికవరీ రేటు 95.64శాతానికి పెరిగిందని అలాగే వారంలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతాని కన్నా తక్కువకు పడిపోయిందని మొత్తంగా 4.39 శాతంగా ఉందని కేంద్రం మంత్రిత్వశాఖ వెల్లడించడం జరిగింది. అలాగే వరుసగా ఎనిమిదవ రోజు 5 శాతాని కన్నా తక్కువగా పాజిటివిటి ఉందని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: