కరోనా వెలుగులోకి వచ్చి మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రతి మనిషిలో మానవత్వాన్ని చంపేసి ప్రాణం మీద తీపిని పెంచింది.  మనం బ్రతికి ఉంటే చాలు ఇక మిగతావాళ్ల ఎటుపోతే మనకేంటి అనే పరిస్థితిని తీసుకొచ్చింది.  కళ్ళముందే ప్రాణాలు పోతున్నా కనికరించని దుస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.  ఎన్నో కుటుంబాలు కరోనా వైరస్ కారణంగా రోడ్డున పడే పరిస్థితి కూడా వచ్చింది.  ఇక ఇంకెంతో మంది చిన్నారులను అనాధలుగా మార్చివేసింది కరోనా.  సంతోషంగా జీవిస్తున్న కుటుంబాలను చిదిమేసింది.



 ఇలా కరోనా సృష్టించిన నష్టం గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే.  చైనా నుంచి భారత్కు పాకిన ఈ మహమ్మారి..  ఊహించనంత నష్టం కలిగించింది . అయితే కరోనా వైరస్ కారణంగా కొన్ని కుటుంబాలు ఉపాధి దొరక్క రోడ్డు మీద పడితే.. కొన్ని కుటుంబాలో ఇంటి పెద్ద చనిపోయి అభం శుభం తెలియని చిన్నారులు అనాధలుగా పారిపోయారు.  ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది..  ఆ ఏళ్ల చిన్నారి ఇంకా లోకాన్ని కూడా సరిగ్గా చూడలేదు.  లోకం తీరు కూడా అర్థం చేసుకోలేదు. కానీ అప్పుడే ఆ చిన్నారికి ఇంటి బాధ్యతలు చూసుకునే పరిస్థితి వచ్చింది. కాదు కాదు ఆ పరిస్థితి కరోనా తీసుకొచ్చింది.



 తల్లిదండ్రులు కరోనా వైరస్ బారినపడి మృతి చెందడంతో..  ఆడుకోవాల్సిన సమయంలో అన్నీ తానే అయింది ఆ 7 ఏళ్ల చిన్నది. నెలల వయసున్న తమ్ముడునీ భుజాన వేసుకుంది. విశ్వమంత బాధను గుండెల్లో దాచుకుని కన్నతల్లిలా తమ్ముడిని లాలిస్తుంది. అందరి మనసులను కలచివేస్తోన్న ఈ ఘటన ఒడిషా లో చోటుచేసుకుంది.  బాలేశ్వర్ జిల్లాకు చెందిన స్మిత అనే మహిళ  ప్రసవం జరిగిన వారం రోజుల్లోనే  వైరస్ బారినపడి మృతి చెందింది.  ఆ తర్వాత కొన్ని రోజులకు కరోనా తో భర్త కూడా చనిపోయాడు.  వారికి ఏళ్ల చిన్నారి, నెలల పసికందు ఉండగా.. వాళ్ళు అనాధలుగా మారిపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ బాబాయి ఇంట్లో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: