దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది.. ఒకప్పుడు డబ్బా ఫోన్ లు వాడే పరిస్థితి  నుంచి ప్రస్తుతం అందరు స్మార్ట్ఫోన్లకు మారిపోయారు.  ఏం కావాలన్నా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో క్షణాలు వ్యవధిలో దొరుకుతుంది .  స్మార్ట్ఫోన్ అర చేతిలో ఉంటే చాలు ప్రపంచాన్ని విశ్లేషించే  స్థాయికి ఎదిగాడు మనిషి.  ఇక ఇప్పుడు 3g నుంచి 4g మారిపోయింది టెక్నాలజీ.  మరికొన్ని రోజుల్లో 5జీ లోకి కూడా మారబోతుంది. ఇలా దేశమంతటా సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.



 కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదు అంటే ఎవరు కూడా నమ్మరు.  కానీ ఇది నిజమే.. నేటికీ కూడా భారత్ లోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయం లేదు..  ఇంటర్నెట్ సదుపాయం దేవుడెరుగు కనీసం మొబైల్ సిగ్నల్ కూడా లేని పరిస్థితి.  దీంతో ఇక ఆయా ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది.  భారత్ కు స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లు గడిచిపోతుంది.  ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో మార్పులు దేశంలో చోటు చేసుకున్నాయి.  కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదు.


 జమ్మూ కాశ్మీర్ లోని కిస్త్ వార్ జిల్లా లో ఉన్న వార్వన్ అనే గ్రామంలో ఇప్పటి వరకు మొబైల్ సిగ్నల్ కు నోచుకోలేదు గ్రామస్తులు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇటీవలే తొలిసారి ఆ ఊరికి మొబైల్ సిగ్నల్ వచ్చింది. దీంతో  గ్రామస్తులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామస్తులు ఎగిరి గంతెయ్యడం ఒక్కటే తక్కువ. ఆధునిక సమాజానికి దూరంగా..  ఆమడ దూరంలో ఉన్న గ్రామానికి జియో కంపెనీ చిరకాల కోరిక తీర్చింది.  ఆ గ్రామంలో సిగ్నల్ టవర్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు స్వతంత్ర భారతదేశంలో మొదటి సారి మొబైల్ సిగ్నల్ పొందారు. అంతేకాదు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా తేవడంతో ఇక ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: