కరోనా సమయంలో ప్రజల పరిస్థితి ఆర్థికంగా ఎంత దిగజారిందో.. ప్రభుత్వాల పరిస్థితీ అలాగే ఉంది. అవును మరి.. జనం సంతోషంగా ఉంటేనే కదా.. ప్రభుత్వానికీ ఆదాయం పెరిగేది. లాక్ డౌన్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. ప్రభుత్వాల ఆదాయాలు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే.. ఒక్క రంగం మాత్రం గతేడాది కంటే చక్కని ప్రగతిని నమోదు చేసింది.

ఆ రంగం.. ఎగుమతుల రంగం. అవును మే నెలలో దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే 69.35 శాతం మేర ఎగుమతులు పెరిగాయి. తద్వారా ఎగుమతుల విలువ 32.27 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, ముత్యాలు ఆభరణాల వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధి కారణంగా ఈ మేరకు ఎగుమతులు పెరిగాయట.

గత ఏడాది మే నెలలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో 19 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయి. 2019 మే నెలలో 29.85 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదైనట్లు కేంద్రం చెబుతోంది. అలాగే దిగుమతులు కూడా గత నెలలో 73.64 శాతం మేర పెరిగాయట. దిగుమతుల విలువ 38.55 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది మే నెలలో 22.2 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. గత మేనెలలో వాణిజ్య లోటు 6.28 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ మే నెలలో...ఆయిల్‌, బంగారం దిగుమతులు బాగా  పెరిగాయి.

ఏదేమైనా దేశీయంగా లాక్‌డౌన్ల కారణంగా మార్కెట్లు మూతబడుతున్నాయి. కొన్ని చోట్ల లాక్‌డౌన్లు లేకపోయినా నైట్ కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలతో పని వేళలు బాగా కుదించుకుపోయాయి. ఈ కారణంగా అత్యవసరాల మార్కెటింగ్‌ మాత్రమే ఎక్కువగా జరుగుతోంది. అందుకే ఈ మేరకు దేశానికి ఆదాయం తగ్గిపోయింది. అయితే.. ఎగుమతులకు లాక్‌డౌన్‌ అడ్డుకాకపోవడం వల్ల.. ఎగుమతులు బాగానే జరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: