గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ రాజకీయ పరిణామాలు ఎంతో వేగంగా మారిపోతున్నాయి.  దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది.  ముఖ్యంగా కేంద్రంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని ప్రస్తుతం బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.  ఈ క్రమంలోనే ఎంతో మంది ఆశావహులు కూడా బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో.. ఎవరికి మంత్రి పదవి దక్కబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది.


 ఇప్పటికే బీజేపీ పెద్దలైన మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఇక వివిధ శాఖలకు చెందిన మంత్రులు పని తీరుపై నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖల్లో మంత్రులు ఎంత సమర్ధవంతంగా పని చేశారు అన్నది గమనిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పార్టీ సీనియర్లతో వరుస సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారిపోయింది . ఈ క్రమంలోనే కొంతమంది కేంద్ర మంత్రులకు శాఖల మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. మరికొంతమందికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరి మంత్రి పదవులు ఊడ బోతున్నాయ్ అన్నది ఆసక్తికరంగా మారింది.


 2019లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత కొన్ని మిత్రపక్షాలు కూటమికి దూరమయ్యాయి. ఈ క్రమంలోనే ఇక మంత్రివర్గంలో ఎన్నో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దాదాపు ఆరు, ఏడుగురు మంత్రులు రెండు శాఖలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఖాయం అన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే గతంలో పదవి ఆశించి భంగ పడిన వారికి ఇక ఈ సారి మాత్రం పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయ్.. ఎవరి పదవులు ఊడిపోతాయి అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారిపోయింది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీ నమ్ముకుని వచ్చిన వాళ్లకి.. గతంలో పదవి ఆశించి భంగపడిన వారికి  మంత్రి పదవులు దక్కడం ఖాయమని ప్రచారం ఊపందుకుంది . మరి కేంద్రం క్యాబినెట్లో కొత్త మంత్రులుగా ఎవరు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: