అయోధ్య రామమందిర నిర్మాణం పై మొదటి నుంచి ఏదో ఒక వివాదం చెలరేగుతోంది. దశాబ్దాల పాటు ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది అయోధ్య కేసులో విజయం సాధించారు.  ఇక హిందువుల చిరకాల వాంఛ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం కోసం అంతా సిద్ధం చేశారు.  రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు భారీగా విరాళాలు అందజేశారు.  ఇక విరాళాల ద్వారా మరోసారి హిందువుల ఐక్యతను చాటారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక ట్రస్ట్ కూడా ఏర్పడింది.  కానీ ఇప్పటికి కూడా అయోధ్య రామమందిర నిర్మాణం పై విమర్శలు, తప్పుడు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు.

 ముఖ్యంగా అయోధ్య ట్రస్ట్ పై తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు కొన్ని పార్టీల నేతలు. ప్రజల్లో అయోధ్య ట్రస్ట్ పై నమ్మకం పోగొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల అయోధ్య ట్రస్ట్  నడిపే విశ్వహిందూ పరిషత్ దీనిపై స్పందించింది. ఇన్ని రోజుల వరకు రామ మందిరాన్ని వ్యతిరేకించిన శక్తులు ప్రస్తుతం అయోధ్య ట్రస్ట్ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తాం అంటూ హెచ్చరించింది.  మందిర నిర్మాణం సజావుగా సాగుతుంది అంటూ స్పష్టం చేసింది.

 అంత సాఫీగా సాగిపోతుంటే చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది వి హెచ్ పి. రామమందిర నిర్మాణం కోసం దశాబ్దాల పాటు ఉద్యమించిన విశ్వహిందూ పరిషత్ పై దేశ ప్రజానీకానికి పూర్తి నమ్మకం ఉంది. దేశ ప్రజానీకం సమర్పించిన ప్రతి  ఒక్క రూపాయికి లెక్క చూపిస్తాం. ఎన్ని శక్తులు అడ్డుకున్న రామమందిర నిర్మాణం జరుగుతోంది. రామ కార్యాన్ని ఎవరు ఆపలేరు.. శ్రీ రామ మందిర్ భవిష్యత్తు భారతానికి స్ఫూర్తిగా  మారుతుందని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: