ఏపీలో అధికార వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా వైసీపీ బలపడిపోయింది. అయితే ఇంత బలంగా ఉన్న వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో కాస్త వీక్‌గా ఉందని తెలుస్తోంది. అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట వైసీపీ ఇంకా పుంజుకోలేకపోతుందని తెలుస్తోంది. అందులోనూ పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీకి అసలు ఛాన్స్ ఇవ్వడం లేదట.

మామూలుగానే పాలకొల్లు టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ ఏడు సార్లు విజయం సాధించింది. గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ టీడీపీ తరుపున నిమ్మల రామానాయుడు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే రామనాయుడుకు చెక్ పెట్టలేకపోతుందని తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ పథకాలు ఫుల్‌గా అందిస్తున్న సరే పాలకొల్లు ప్రజలు రామానాయుడు వైపే ఉన్నారట. వైసీపీ ఇన్‌చార్జ్ కవురు శ్రీనివాస్ బాగానే కష్టపడుతున్న రామనాయుడుకు చెక్ పెట్టేలేకపోతున్నారట.

ఎందుకంటే రామానాయుడు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే తనకు సాధ్యమైన ప్రజలకు సాయం చేస్తున్నారు. ఏ మాత్రం ఎమ్మెల్యే అనే గర్వం లేకుండా ఓ సాధారణ వ్యక్తిలాగా రామానాయుడు, పాలకొల్లులో తిరుగుతారు. సైకిల్ మీదే వూరు వూరు తిరుగుతూ ప్రజల బాగోగులని చూసుకుంటారు.

అలాగే ప్రజలు ఏమన్నా సమస్య అంటే చాలు, అది పరిష్కారం అయ్యేవరకు కృషి చేస్తారు. అలాగే అధికారులు సరిగ్గా పనిచేయకపోతే, వాళ్ళ ఆఫీసులు ముందే అనేకసార్లు నిరసన దీక్షలు చేశారు. ఇలా నియోజకవర్గ స్థాయిలో రామానాయుడు మంచి పనితీరు కనబరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ, వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ పెద్దగా మైనస్‌లు లేకుండా ఉన్న రామానాయుడు పాలకొల్లులో వైసీపీకి అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: