ఐదు రోజుల క్రితం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఇళ్లు కార్యాల‌యాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.అయితే ఈ సోదాల‌కు సంబంధించి ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఈడీ స‌మాన్లు జారీ చేసింది.ఈ నెల 25వ తేదీన హాజ‌రుకావాలంటూ ఈడీ స‌మ‌న్ల‌ను జారీ చేసింది. బ్యాంక్ రుణాలు మ‌ళ్లించిన కేసులో నామా నాగేశ్వ‌ర‌రావుకు స‌మ‌న్లును ఈడీ జారీ చేసింది. మ‌ధుకాన్ కేసులో ఉన్న నిందితుల‌కు కూడా ఈడీ స‌మాన్లు జారీ చేసిన‌ట్లు స‌మాచారం.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్‌లో చేరి ఖ‌మ్మంగా ఎంపీగా నామా నాగేశ్వ‌ర‌రావు పోటీ చేసి గెలిచారు.గెలిచిన త‌రువాత ఖ‌మ్మంజిల్లా టీఆర్ఎస్‌లో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ స‌మ‌యంలో నామా నాగేశ్వ‌ర‌రావు మ‌ధుకాన్ కంపెనీ పేరుతో ప‌లు బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో రుణాల‌ను తీసుకుని విదేశీ కంపెనీల‌కు మ‌ళ్లించార‌నే అభియోగాలు ఉన్నాయి.రూ.1064 కోట్లు ఫ్రాడ్ చేశార‌ని బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.నామాకు సంబంధించిన ఇల్లు, ఆఫీసుల్లో ఏక కాలంలోనే ఈ సోదాలు నిర్వ‌హిచారు. తాజ‌గా ఈ రోజు నామా నాగేశ్వ‌ర‌రావుకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది.
ఓ ప‌క్క టీఆర్ఎస్ పార్టీలో భూములు క‌బ్జా చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌ని మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌రఫ్ చేశారు.అయితే నామా నాగేశ్వ‌ర‌రావుపై ఈడీ అభియోగాలు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈయ‌న‌పై సీఎం ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటార‌నే దానిపై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వేచి చూస్తున్నారు.ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీలో భూకబ్జా ఆరోప‌ణ‌లు అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేల‌పై వ‌చ్చినప్ప‌టికి కేవ‌లం ఈట‌ల రాజేంద‌ర్‌పైనే వేటు వేశార‌ని ఆరోపిస్తున్న స‌మ‌యంలో ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు విష‌యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీస‌కుంటార‌నేది చ‌ర్చనీయాంశ‌గా మారింది
మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ టీఆర్ఎస్ నేత‌ల అవినీతి చిట్టాను త‌యారు చేశామ‌న్న కామెంట్స్ చేసిన కొద్ది రోజుల్లోనే ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుపై ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్ అయింది.రాజ‌కీయ కోణంలోనే నామాపై ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన‌ట్లు టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు.దీన్ని బ‌ట్టి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఖ‌మ్మం జిల్లాగానే క‌నిపిస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: