మెగాస్టార్ చిరంజీవి మీద అధికార వైసిపి ఏపీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున చిరంజీవికి ఒక సీటు కూడా ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈమధ్య వైసిపి బాధ్యతలన్నీ తలకెత్తుకున్నట్లు ఫీల్ అవుతున్న శ్రీ రెడ్డి లాంటి వాళ్లు సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవికి సీటు ఇవ్వద్దని జగన్ ను కోరుతున్నారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే చిరంజీవికి సీటు ఇవ్వడం లేదని వైసీపీ, తీసుకోవడం లేదని చిరంజీవి సైతం ఖండించడం లేదు.. అలాగని ఆమోదించడం లేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక చిరంజీవి ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నారు. 


జగన్ కూడా చిరంజీవి విషయంలో అలాంటి సాహిత్యమే ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే దాసరి నారాయణరావు మరణానంతరం సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా చిరంజీవి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరు వర్గాల మధ్య మంచి సానుకూల సంబంధాలే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే జగన్ చిరంజీవి విషయంలో మాత్రం చాలా సానుకూల వైఖరి చూపిస్తూ వస్తున్నారు. జగన్ చిరంజీవి మీద సానుకూల దృక్పథాన్ని చూపించడంలో మరో కోణం కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ జనసేన వచ్చే ఎన్నికల సమయానికి మళ్లీ టీడీపీతో కలిసినా ఆశ్చర్యం లేదని ఒకవేళ అదే జరిగితే కాపుల వోట్లు టిడిపికి పడి తాము నష్టపోతామని భావిస్తున్నట్లు సమాచారం.. 

అందుకే కాపు ఓట్లు చీల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైసిపి అందులో భాగంగానే చిరంజీవి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన వైసీపీలో యాక్టివ్ కావాలని అవసరం లేదని కోరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ సంస్థకు చెందిన పరిమల్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇచ్చామని ఆయన పనిలో ఆయన ఉన్నారని కేవలం పార్టీకి అవసరమైన ఓటింగ్ సమయంలోనే అండగా నిలబడాలని అందుకే తమ సీటు తీసుకోమని చిరంజీవిని ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: