తాజాగా గవర్నర్ కోటాలో లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీగా నియమితులైన విషయం తెలిసిందే. ఐతే చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజినీ అప్పిరెడ్డి ని వైయస్ఆర్ సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైనందుకు ఆయనకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

"ఈ రోజు లేళ్ల అప్పిరెడ్డి ని కలవడం జరిగింది. ఎమ్మెల్సీ, ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా ఎన్నికైనందుకు ఆయనకు నా శుభాకాంక్షలు తెలిపాను. ఆయనకు విజయవంతమైన పదవీకాలం దక్కాలని నేను కోరుకుంటున్నాను" అని విడదల రజినీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు షేర్ చేశారు.



ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు అనగా జూన్ 16వ తేదీన తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన నేటితో 62 వసంతాలు పూర్తిచేసుకుని.. 63 వసంతంలోకి అడుగు పెట్టారు. అయితే ఎమ్మెల్యే విడదల రజినీ సజ్జల రామకృష్ణారెడ్డికి బర్త్‌డే విషెస్ తెలిపారు.

"ఈరోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ని కలిశాను. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలిపాను. భగవంతుడు అతనికి మంచి ఆరోగ్యం, అపారమైన ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నాను," అని ఆమె ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.



ఇకపోతే విడదల రజినీ నిన్న వాహన మిత్ర పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధి దారులకు అందించారు. అలాగే కొద్దిదూరం పాటు ఆటో నడిపారు. ఆమె ఆటో డ్రైవింగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలకు కళ్లెం వేసేందుకు ఆమె నడుం బిగించారు. ఎవరైతే తమ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ భాస్కర్ తో పాటు పట్టణ సీఐలను ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: