ఈరోజు జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రవేట్ ఆస్పత్రులపై మరో సారి సీఎం దృష్టి సారించారు. ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదని, ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దని సూచించారు. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి, రెండోసారి చేస్తే క్రిమినల్‌కేసులు చేయాలని అన్నారు. 


థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతూ అసలు అది వస్తుందో, లేదో మనకు తెలియదని, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమని అన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్న ఆయన థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు కాబట్టి ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలన్న ఆయన పిల్లల వైద్యంకోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నామని దానికి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలని అన్నారు. 


ఇక దేశంలో వ్యకినేషన్ కెపాసిటీ పెరగాలన్న ఆయన వ్యాక్సినేషన్‌ అన్నది చాలా ముఖ్యమైనదని అన్నారి. మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని, నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. నిర్ణయించుకున్న విధానాల నుంచి పక్కకు పోవద్దని, మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటే  ఇందులో కేవలం 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు వ్యాక్సిన్లు ఇవ్వగలిగామని అన్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: