తెలంగాణకు ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ.. నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడటం లో మాత్రం ఎప్పుడు అలసత్వం వహించరు మంత్రి హరీష్ రావు. ప్రజలమధ్య ఉంటూ ఎప్పుడూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిందన్న క్షణాల్లో అక్కడ వాలిపోతూ ఉంటారు.  ఇకపోతే ఇటీవల మిరుదొడ్డి మండల కేంద్రం లో నూతన వ్యవసాయ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.  హరీష్ రావు  తో పాటు ఎంపీ కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.



 ఈ సందర్భంగా ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పాలన గురించి.. అందుతున్న పథకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు . టిఆర్ఎస్ పార్టీలో ఓపికతో ఉన్న కార్యకర్తలకు ఎప్పటికైనా మంచి అవకాశం లభిస్తుంది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక వ్యవసాయ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అంటూ తెలిపారు మంత్రి హరీష్ రావు.  ఎన్నో ఏళ్ల పాటు తాగునీరు సాగునీరు లేక తెలంగాణ ప్రజలు అల్లాడిపోయారు అంటూ తెలిపారు.  కేవలం టిఆర్ఎస్ వచ్చిన తర్వాతే ఇక తెలంగాణ ప్రజల కష్టాలు తీరాయి అంటూ తెలిపారు.



 తొలకరి చినుకు పడకముందే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు హరీష్ రావు.  అయితే మిగతా పథకాలన్నింటినీ ఆపుతాం కానీ.. అటు రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మాత్రం ఎప్పటికీ ఆపము అంటూ తెలిపారు.  భూమికే బరువయ్యేంత పంట తెలంగాణాలో పండించాం అంటూ మంత్రి హరీష్ తెలిపారు.  దీని కోసం టిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వెలకట్టలేనిది అంటూ చెప్పుకొచ్చారు   ఇతర రాష్ట్రాల నుంచి సైతం తెలంగాణకు వచ్చి వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని.. ఆ స్థాయికి తెలంగాణ చేరుకుంది అంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: