వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు లేఖ‌ల పరంప‌ర కొన‌సాగుతుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ర‌ఘురామ‌రాజు లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్హ‌త‌కు మించి అప్పులు చేస్తున్న వైనాన్ని మోడీకి లేఖ ద్వారా వివ‌రించారు.ఆస్తులు త‌న‌ఖా పెట్టి మ‌రీ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతుంద‌ని ఆరోపించారు.ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ఏపీఎస్డీసీకి బ‌దిలీ చేసి మ‌రి రుణాలు సేక‌రిస్తోంద‌ని లేఖ‌లో పేర్కోన్నారు.ఇప్ప‌టికే ఏపీఎస్‌డీసీ వివిధ బ్యాంకుల నుంచి 10వేల కోట్ల రుణాల‌ను తెచ్చింద‌ని తెలిపారు.ఉచిత  ప‌థ‌కాల‌కు మ‌రో మూడువేల కోట్ల రూపాయ‌ల రుణం తెచ్చేందుకు బ్యాంకుల‌తో ప్ర‌భుత్వం సంప్ర‌దిస్తోంద‌ని లేఖ‌లో ప్ర‌స్తావించారు.

ఇప్ప‌టికే దుబాయ్‌కి చెందిన లులూ సంస్థ‌కు విశాఖ‌లో కేటాయించిన  భూముల‌ను కూడా తాక‌ట్టు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు.ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధిని మించి అప్పులు చేసింద‌ని...త‌ల‌కు మించిన చేసిన అప్పుల కార‌ణంగా వ‌చ్చే ఏడాది నుంచి 35 వేల కోట్లు కేవ‌లం వ‌డ్డీగా చెల్లంచాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌తి నెల‌కు స‌గ‌టున 9,226 కోట్లు అప్పు చేసింద‌ని ర‌ఘ‌రామ‌రాజు లేఖ‌లో ప్ర‌స్తావించారు.విచక్షణరహితంగా చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడితప్పిందని...ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉన్నందున ప్రధాని జోక్యం చేసేకోవాల‌ని ర‌ఘురామ‌రాజు కోరారు. ప్రజా సంక్షేమం ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నంగా ఇది క‌నిపిస్తోంద‌న్నారు.

ర‌ఘురామ‌రాజు బెయిల్‌పై విడుద‌లైన త‌రువాత వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిపిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌డు పాద‌యాత్ర చేశారు.ఈ యాత్ర‌లో అనేక హ‌మీల‌ను ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు.అయితే అధికారంలోకి వ‌చ్చాక ఇచ్చిన హ‌మీల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డంలేదంటూ వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌రాజు సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌శ్నిస్తున్నారు.పెన్ష‌న్లు ఏటా 250 పెంచుతాన‌ని  చెప్పిన జ‌గ‌న్ రెండేళ్లు గ‌డుస్తున్నా పెన్ష‌న్ల పెంపు అమ‌లు కాలేద‌ని తెలిపారు.ఇలా అన్ని ప‌థ‌కాల‌పై సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌రాజు లేఖ‌లు రాశారు.ఇప్పుడు తాజ‌గా ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌పై ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు.మ‌రి ర‌ఘురామ‌రాజు లేఖ‌కు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: