ఇ– క్రాపింగ్‌ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇ– క్రాపింగ్‌ చేయకపోతే... కలెక్టర్‌ విఫలం అయ్యారని భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలని పేర్కొన్న జగన్ రైతుకు డిజిటల్‌ అకానలెడ్జ్‌ మెంట్‌తో పాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలు ఆధరంగా నే ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుంది, బీమా వస్తుందని ఆయన అన్నారు. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదని ఆయన ఆదేశించారు. 

తప్పులు ఉంటే.. రైతులకు నష్టం జరుగుతుందన్న ఆయన మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలని అన్నారు. ఇ– క్రాపింగ్‌ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట... కూడా నమోదు చేయాలని జగన్ ఆదేశించారు. ఇక వివాదాస్పదమైన భూమి అయినా సరే పర్వాలేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హార్టికల్చర్‌ విషయంలో సీజన్‌తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్‌ చేయాలని జగన్ ఆదేశించారు. ఇక నకిలీ విత్తనాల గురించి మాట్లాడిన ఆయన రైతులకు నాణ్యమైన విత్తనాలే అందాలని, నకిలీలకు ఆస్కారం ఉండకూడదని ఆదేశించారు. 

ఈవిషయంలో కలెక్టర్లు దృష్టిపెట్టాలన్న ఆయన నాణ్యమైన విత్తనాలు రైతులకు ఆర్బీకేలద్వారా అందేలా చూడాలని అన్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా పరిశీనలు జరగాలని, డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలని అన్నారు. పోలీసుల సహకారంతో రెయిడ్స్‌ జరగాలని, అప్పుడే బ్లాక్‌మార్కెటింగ్, కల్తీలకు అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు. అనైతిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: