దేశంలో మంచి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం ఎవరంటే? ఠక్కున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పేయొచ్చు. ఏపీ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా జగన్ పథకాలు అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై సంక్షేమ వరాలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక పథకాల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎంతో లబ్ది పొందుతున్నాయి. అందుకే ఇప్పటికీ వారు జగన్ వైపే ఉన్నారు.


అయితే రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకోవాలంటే సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోతాయా? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే పథకాల వల్ల జగన్‌కు ప్రస్తుతం ప్లస్ అవుతున్న, రానున్న రోజుల్లో అవే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఆదాయం సృష్టించకుండా, అప్పులు చేస్తూ పథకాలు అమలు చేయడం వల్ల ప్రజలపై ఆర్ధిక భారం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పటికే బయట ధరలు ఎలా మండుతున్నాయో అందరికీ తెలిసిందే.


మనిషికి అవసరమైన ప్రతి వస్తువు రేటు పెరిగిపోయింది. అసలు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. అటు పన్నులు ఏ విధంగా పెంచుకుంటూ వెళుతున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఓ రకంగా చెప్పాలంటే పథకాల రూపంలో వచ్చే డబ్బులు పన్నులు రూపంలోనే పోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారని అంటున్నారు.


అయితే పన్నులు, ధరలు అదుపులో ఉంచకుండా పథకాల ఇస్తూ పోవడం వల్ల ఫ్యూచర్‌లో జగన్ ప్రభుత్వానికే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో సరైన అభివృద్ధి లేకపోవడం కూడా పెద్ద మైనస్ అవుతుంది. ఇటీవలే రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయని చెప్పారుగానీ, అవన్నీ అంతకముందే వచ్చినవి అని ప్రజలకు అర్ధమైంది. కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తే జగన్‌కు ప్లస్ అవుతుంది. లేదంటే అదే పెద్ద మైనస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: