కొవాగ్జిన్ టీకా.. ఇండియా సొంత టీకా.. భారత్‌లోనే పూర్తిగా తయారైన ఏకైక టీకా. అది కూడా మన హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన టీకా. అంతే కాదు. ఇప్పుడు ఇండియాలో ఈ టీకాకు చాలా డిమాండ్ ఉంది. విదేశీ టీకా కోవిషీల్డ్‌తో పోలిస్తే.. ఈ టీకా ఖరీదు కూడా ఎక్కువ. అయితే రెండు, మూడు రోజులుగా ఈ టీకాపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. ఈ టీకా తయారీలో లేగ దూడల సీరం వాడుతున్నారు అని.

సీరం అంటే రక్తంలో ఉంటే ఓ రకమైన పసుపు పచ్చని ద్రావకం. ఈ లేగ దూడల సీరం కోసం పెద్ద ఎత్తున లేగ దూడలను చంపుతున్నారని ఓ కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో ఆరోపణలు చేశాడట. దీని ఆధారంగా మరికొన్ని కట్టుకథలు పుట్టుకొచ్చాయి. దీంతో ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ, భారత్ బయోటెక్ వివరణ ఇచ్చాయి. ఇంతకీ ఆసలు విషయం ఏంటంటే.. కొవాగ్జిన్ టీకాల తయారీలో లేగ దూడల సీరం అనేదే వాడటం లేదట.

మరి ఈ ప్రచారం ఎందుకు వచ్చిందంటే.. అసలు వైరల్ జబ్బులను నిరోధించేందుకు తయారు చేసే టీకాల్లో లేగదూడల సీరం వాడతారట. ఈ లేగ దూడల సీరం ద్వారా వైరస్ ను ఉత్పత్తి బాగా పెంచుతారట. ఆ తర్వాత ఆ వైరస్‌ను క్రియాశీల రహితం చేసి.. ఆ ద్రావకంతో టీకా రూపొందిస్తారట. ఇదీ టీకాలు తయారు చేసే పద్దతి. అయితే ఈ కొవాగ్జిన్ తయారీలో మాత్రం లేగ దూడ సీరం మాత్రం అసలు వాడలేదట.

ముందుగా ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. ఆ తర్వాత భారత్ బయోటెక్ సంస్థ కూడా ఇదే వాదనతో ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కోవాగ్జిన్ టీకా తయారీలో లేగ దూడల సీరం వాడుతున్నారన్నది వట్టి ఫేక్ వార్త అని రుజువయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: