ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. గతంలో రెండవ దశ కరోనా వైరస్ కేసుల సంఖ్య చూస్తూ చూస్తుండగానే పెరిగిపోయింది. ఇక ప్రతిరోజూ ప్రమాదకర రీతిలో  వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా వేధించింది. కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే విపత్కర పరిస్థితులు వచ్చేలా కనిపించింది. ఈ క్రమంలోనే మొదట నైట్ కర్ఫ్యూ విధించినా ప్రభుత్వం.. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు అని భావించింది. ఈ నేపథ్యంలో ఇక లాక్డౌన్ విదిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.



 ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తూ.. మిగతా సమయం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుంది అంటూ స్పష్టం చేసింది. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి అటు కరోనా వైరస్ కేసులు తగ్గుదల మొదలైంది. ప్రస్తుతం  వైరస్ కేసులు కాస్త కంట్రోల్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.  దీంతో తెలంగాణ ప్రభుత్వం  లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తూ వస్తోంది.  కొన్ని రోజుల వరకు ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు కొనసాగుతోంది.


 ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  ఈనెల 20 తర్వాత ప్రభుత్వం పూర్తిగా అన్ లాక్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గడం వ్యవసాయ సీజన్ కూడా వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే ఆంక్షలు ఎత్తివేయడం ఎంతైనా అవసరమని అటు ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.. ఇక జూన్ 19 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే త్వరగా లాక్ డౌన్ ఎత్తివేయడం మంచిది అని ప్రభుత్వం భావిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: