థర్డ్ వేవ్ లో చిన్నారులు అధికంగా కరోనా భారిన పడే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి కొన్ని కీలక మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా పెద్దలకు కరోనా చికిత్స కొరకు వాడే ఔషధాలను చిన్నారులకు వాడి ప్రయోగాలు చేయరాదని హెచ్చరించింది. ప్రధానంగా హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, ఫావిపిరావిర్‌ మరియు అజిత్రోమైసిన్‌ వంటి ఔషధాలను పిల్లలకు కరోనా చికిత్స నిమిత్తం వినియోగించరాదని తెలియజేసింది. ఇప్పటి నుండే ఆరోగ్య కేంద్రాలు అప్రమత్తం కావాలని అంచనాల ప్రకారం చిన్నారులు భారీగా కరోనా భారిన పడితే ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉండే విధంగా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సవినయంగా తెలియచేసింది. ముఖ్యంగా చిన్నారుల తల్లి తండ్రులకు ఊరట కలిగించే వార్తను అందజేసింది.

* ఏ  చిన్నారులకు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం వస్తుందో అటువంటి చిన్నారుల చికిత్స సమయంలో వారి తల్లితండ్రులను అనుమతించవచ్చు అని   పేర్కొంది.

* చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని ప్రభుత్వం నుండి అనుమతి వస్తే ముందుగా ఇతర వ్యాధులతో బాధపడుతున్నటువంటి చిన్నారులకు వ్యాక్సిన్ ను అందించాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లలు వేగంగా వైరస్ భారిన పడే అవకాశం ఉంది.

* రానున్న రోజుల్లో కరోనా ప్రభావం పిల్లలపై ఎక్కువైతే అందుకు ప్రైవేటు ప్రభుత్వ రంగాలు ఇరువురు కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకోసం ప్రణాళికను రచించాలి.

*పిల్లల కరోనా చికిత్సలో భాగంగా పెద్దవారికి అందించిన కరోనా ఔషధాలను ఎట్టిపరిస్థితుల్లో వాడరాదు. వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ మందులను వాడటం మంచిదో అన్న అంశంపై వైద్యులు అవగాహన పెంచుకోవాలి.

* లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం స్కూల్స్, కాలేజీలు తిరిగి తెరుచుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా ఎదుర్కొనేందుకు వైద్య రంగాలు సిద్దంగా ఉండాలి.

* కరోనా మూడవ దశలో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది అన్న అంచనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్ లో అదనంగా  బెడ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

* హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఆశావర్కర్ల సేవలు అవసరం ఎక్కువగా ఉంటుంది. కావున ఈ దిశగా ఆలోచించి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

*పిల్లల్లో కరోనా సోకిన లక్షణాలు పెద్దగా కనపడవు అలాంటప్పుడు ముఖ్యంగా తల్లి తండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అవసరం అనిపిస్తే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి

మరింత సమాచారం తెలుసుకోండి: