ఈ మధ్య కాలంలో టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ వేదికగా వేధింపులు కూడా ఎక్కువయ్యాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అదీకాక ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు ఆన్లైన్ వేదికగా ఎక్కువ వేధింపులు ఎదుర్కొంటున్నారు.. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నివారణ చర్యలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. అయినా సరే ఆన్లైన్ వేధింపులు మాత్రం తగ్గటం లేదు. తాజాగా అలాంటి ఒక దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. 


ఒక మైనర్ బాలికను ఒక టీచర్ ప్రేమలోకి దింపాడు.. అది కూడా ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ఫేస్బుక్ ద్వారా. అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఒక బాలికకు ఫేస్బుక్ ద్వారా ప్రైవేటు ఉపాధ్యాయుడు దినేష్ దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో ఆ బాలికను బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. లైంగిక దాడికి పాల్పడిన తరువాత ఇలా లైంగిక దాడి చేసిన విషయం ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని సదరు బాలికని వేధించినట్లు సమాచారం. 


అయితే చాలాకాలం పాటు అతని వేధింపులు భరించిన మైనర్ బాలిక ఎవరికీ చెప్పకుండా తనలో తాను కృంగి పోయేది. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో ఇక తట్టుకోవడం తనవల్ల కాదు అని భావించిన సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక మైనర్ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రైవేట్ టీచర్ దినేష్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. ఎవరైనా ఇలా వేధింపులకు పాల్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, బాదితుల పేరు, వివరాలు బయటకు రానీయకుండా కచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: