తెలంగాణ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటెల ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.  ఇది కాస్తా సంచలన గా మారిపోయింది. ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగానే ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది.  గతంలో దుబ్బాక సీన్ రిపీట్ చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.


 హుజురాబాద్ లో ఈటెల కు మంచి పట్టు ఉండడంతో ఇక ఆ నియోజకవర్గ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అటు కేసీఆర్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటెల నియోజకవర్గం హుజురాబాద్ కి భారీగా నిధులు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. ఇటీవలే హుజురాబాద్ మున్సిపాలిటీ కోసం 35 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. అంతేకాదు ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలను కూడా అందరికీ అందే విధంగా శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు.




 హుజూరాబాద్ పట్టణానికి 35 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. ఇందులో 10.52 కోట్లు తాగునీటి అవసరాలు తీర్చడానికి ఉపయోగించనూన్నట్లు తెలుస్తోంది. వార్డుల్లో అభివృద్ధి పనులకు 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు.  ఇక ఈ నిధులతో వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడట. ఇలా హుజురాబాద్ ప్రజలందరినీ ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఈటల రాజేందర్ రాజీనామా.. హుజరాబాద్ ప్రజలకు వరంగా మారిందని అంటున్నారు విశ్లేషకులు.  ఎందుకంటే ఈటల రాజీనామా వల్లే ఇక హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పెండింగ్ లో ఉన్న పథకాలు మరికొన్ని రోజుల్లో అందరికీ అందనున్నాయి. ఇలా  ఈటల రాజేందర్ రాజీనామా హుజరాబాద్ ప్రజలకు కలిసి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: