ఫార్టీ ఇయర్స్ పార్టీ, నడిపే అధినాయకుడు కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. ఎన్నో వైభోగాలను చూసింది టీడీపీ, మరెన్నో వెలుగులను కూడా చవి చూసింది. టీడీపీ మొత్తం హిస్టరీలో 22 ఏళ్ళ పాటు అధికారంలో ఉంది. కేంద్రంలో ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది.

అటువంటి టీడీపీకి ప్రాభవం పుట్టిన చోటనే అంటే తెలంగాణాలో 2014 నుంచే తగ్గిపోతూ వచ్చింది. ఇపుడు ఎంత దారుణం అంటే ఏకంగా పార్టీ ప్రెసిడెంట్ కూడా విడిచి వెళ్లిపోతారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీకి తెలంగాణాలో ఎంతో బలం ఉంది. ఎన్టీయార్ అన్నా చంద్రబాబు అన్నా కూడా జనాలు ఇష్టపడతారు. కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. అలాంటి చోట పార్టీది గత వైభవం కావడం అంటే వాటిలో  అధినాయకత్వం చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఏపీలో అధికారంలోకి రావడంతో  నాడు తెలంగాణాను వదిలేసుకుని ఇటు వచ్చేశారు.

ఆ తరువాత ఏపీలో అధికారం పోయింది. ఇపుడు తెలంగాణాలో టీడీపీని ఇంకా జారుతూంటే 2014 నాటి తెలంగాణా టీడీపీ పరిస్థితి ఇపుడు ఏపీలో ఉంది. అయితే చంద్రబాబు లోకేష్ సహా ముఖ్య నాయకులు అంతా ఏపీవారే కావడం, ఏపీ మీద వారు దృష్టి పెట్టడంతో ఇంకా ఇక్కడ బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే వైసీపీతో గట్టిగానే పోరాడాల్సి వస్తోంది. ఈ మధ్యలో  అనేక ఎన్నికలు జరిగితే అన్నింటా టీడీపీ ఓడిపోవడం దారుణమే. ఏపీలో రెండేళ్ల క్రితం ఓడిన టీడీపీకి ఇంకా పట్టు చిక్కడంలేదు. ఈ లోగా కరోనా వచ్చి మొత్తం పొలిటికల్  సీన్ మార్చేసింది. ఎక్కడికీ వెళ్లకుండా ఏడాదికి పైగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోవడం కూడా పార్టీ మీద పెను ప్రభావం చూపిస్తోంది.

ఇప్పటికైతే ఏపీలో టీడీపీ నిరాశాపూరిత‌మైన వాతావరణంలోనే మనుగడ సాగిస్తోంది. అటూ ఇటూ ఇద్దరు ప్రాంతీయ అధ్యక్షులను టీడీపీ నియమిస్తే అటు వైపు వారు తప్పుకునే సీన్ కనిపిస్తోంది. ఇటు వైపు చూసినా పెద్దగా జోరు కనిపించడంలేదు. మొత్తానికి చూస్తే టీడీపీ తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని ఇబ్బందులు చవి చూస్తోందని చెప్పాలి. దీని పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

   


మరింత సమాచారం తెలుసుకోండి: