కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కార్ ప‌నులు అప్పుడ‌ప్పుడూ గ‌మ్మ‌త్తుగా అనిపిస్తాయి. దేశంలో ఏ రాజ‌కీయనాయ‌కుడు సెల‌బ్రెటీ కాషాయ భ‌జ‌న చేసినా వారికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం దేశం యొక్క మొద‌టి క‌ర్త‌వ్యం అన్నట్టుగా ప్ర‌వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ చేసిందేమీ లేక‌పోయినా పువ్వు పార్టీకి స‌పోర్క్ చేస్తుంద‌న్న కార‌ణం..మహా స‌ర్కార్ పై నిప్పులు చెరుగుతుంద‌న్న కార‌ణంతో కేంద్రం నుండి సెక్యురిటీని కోరింది. దాంతో కేంద్రం కంగానా ఏదో ఆర్మీలో ప‌నిచేసి ఉగ్ర‌వాదులకు టార్గెట్ గా మారిన‌ట్టు వెంట‌నే కేంద్ర బ‌ల‌గాల‌తో సెక్యురిటీని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎంపీ ర‌ఘుర‌మ‌కృష్ణం రాజు ప్ర‌భుత్వం పై విమ‌ర్ష‌లు చేస్తూ కేంద్రం పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఆయ‌న కూడా త‌న‌కు సొంత నియోజ‌కవ‌ర్గంలో ముప్పు ఉంద‌ని వెంట‌నే ర‌క్ష‌ణ కావాల‌ని కోర‌గా ఆయ‌న‌కు సైతం వై సెక్యురిటీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. ఇక త‌మ పార్టీ కాక‌పోయినా స‌పోర్ట్ చేసే వారికే అంత ప్రాధాన్య‌త ఇస్తున్న మెడీ స‌ర్కార్ త‌మ విరోధి పార్టీ నుండి వ‌చ్చి కాషాయం క‌ప్పుకుంటే సెక్యురిటీ ఇవ్వ‌కుండా ఉంటుందా. ఈ నేప‌థ్యంలోనే బెంగాల్ ఎన్నిక‌ల‌కు మందు తృణ‌మూల్  కాంగ్రెస్ పార్టీ నుండి త‌మ పార్టీలోకి చేరిన ముకుల్ రాయ్ కి ఏకంగా జెట్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించింది. దాంతో ముకుల్ రాయ్ కోసం 33 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు రంగంలోకి దిగి సెక్యురిటీని క‌ల్పించారు. టీఎంసీ నుండి వ‌స్తున్న బెదిరింపుల‌ను ఎదుర్కునేందుకే ముకుల్ రాయ్ కి జెట్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది.

అయితే ఎన్నిక‌ల త‌ర‌వాత తృణ‌మూల్ భారీ మెజారిటీతో గెల‌వ‌డంతో ముకుల్ రాయ్ సొంత గూటికి చేర‌డ‌మే మేలు అని భావించారు. ఇటీవ‌ల పార్టీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ స‌మ‌క్షంలో మ‌ళ్లీ సొంత పార్టీలో చేరిపోయారు. అంతే కాకుండా దీదీనే త‌న సుప్రీం నాయ‌కురాలు అని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా తాను తృణ‌మూల్ లోనే సంతోషంగా ఉన్నాన‌ని మ‌ళ్లీ బీజేపీలో చేరే ప్ర‌సక్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. దాంతో మోడీ స‌ర్కార్ చిన్న పిల్ల‌ల్లా ప్ర‌వ‌ర్తించింది. మా పార్టీలో ఉండ‌న‌ప్పుడు మా సెక్యురిటీని మాకు ఇచ్చెయ్.. అంటూ ముకుల్ కు క‌ల్పించిన జెడ్ సెక్యురిటీని తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp