ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు గత కొంత కాలం నుంచి బాగా తగ్గుముఖం పడుతున్నాయనే చెప్పాలి.ఇక గత రెండు రోజులుగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 6 వేలకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. ఇక గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మరోసారి 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో మొత్తం 57 మంది చనిపోయారు.గత 24 గంటల్లో 1,07,764 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 6,341 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇక అలాగే మొత్తం 8,486 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,341 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో ఈసారి అత్యధికంగా తూర్పుగోదావరిలోనే 1247 కొత్త కేసులు వెలుగుచూశాయి.ఇక మిగతా జిల్లాల్లో చిత్తూరులో 919, పశ్చిమగోదావరి జిల్లాలో 791, ప్రకాశం జిల్లాలో 453, కృష్ణా జిల్లాలో 461,కడప జిల్లాలో 378, శ్రీకాకుళం జిల్లాలో 372, గుంటూరు జిల్లాలో 353, అనంతపురం జిల్లాలో 316 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో 295, విశాఖ జిల్లాలో 299, కర్నూ జిల్లాలో 266, విజయనగరం జిల్లాలో 191 కేసులు నమోదయ్యాయి.ఇక వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 18 లక్షల 39వేల 243 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇందులో మొత్తం 17 లక్షల 59వేల 390 మంది కోలుకున్నారు. అలాగే మరో 67వేల 629 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇక కరోనా మరణాల విషయానికొస్తే  గడిచిన 24 గంటల్లో 57 మంది కరోనా మహమ్మారితో చనిపోయారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో ఎనిమిది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, కర్నూల్ జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. ఇక వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ ఆంధ్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య 12వేల 224 మందికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: