వర్షా కాలం వచ్చిందంటే చాలు ఇక కరెంట్ కష్టాలు మొదలవుతాయి.  కాస్త వర్షం కురిసిన.. గాలివాన వచ్చిన కరెంట్ పోతూ ఉంటుంది.  దీంతో ఇక ఇంట్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు రాత్రి సమయాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవు.  అయితే ముఖ్యం గా కరెంట్ స్తంభాలు దగ్గర ఉన్న లూస్ కనెక్షన్ కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.  ఇక ఇలా ఇబ్బందులు ఎదురైన సమయంలో ప్రజలు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కొన్నిసార్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు విద్యుత్ అధికారులు.



 ఇక విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పి చెప్పి నోరు నొప్పి పెడుతుంది తప్ప.. సమస్య మాత్రం పరిష్కారం కాదు.  ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు మరి కొంత మంది జనాలు.  ఇక పైఅధికారులు కల్పించుకుని ఇక సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తూ ఉంటారు. ఒకవేళ  ప్రజలు నేరుగా విద్యుత్ శాఖ మంత్రి కి ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేస్తే.. కొంతమంది మంత్రులు వెంటనే స్పందించి అధికారులకు చెప్పి ఇక సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారు.


 కానీ నేరుగా విద్యుత్ శాఖ మంత్రులు సమస్య పరిష్కారం కోసం వస్తారా..  అంతమంది అధికారులు ఉండగా ఇక నేరుగా మంత్రులు ఎందుకు వస్తారు అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ ఒక మంత్రి మాత్రం నేరుగా సమస్య పరిష్కరించడానికి వచ్చేశాడు. మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ ట్రాన్స్ఫార్మర్ పై చెట్ల తీగలు అల్లుకుని ఉన్నాయి అని ఫిర్యాదు ప్రజల నుంచి రావడంతో.. ఇక నేరుగా రంగంలోకి దిగారు. స్వయంగా  ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి చేరుకొని ట్రాన్స్ఫార్మర్ పై అల్లుకున్న తీగలను తొలగించారు.  పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మందలించారు మంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: