రాజకీయ పరిజ్ఞానం ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడీని బాగా దగ్గరగా గమనించిన వాళ్లకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లో ఉండే విషయ పరిజ్ఞానం గురించి చాలామందికి క్లారిటీ లేదు. ఆయనలో విషయం లేదు కాబట్టే చాలామంది బిజెపి నేతలు ఆయనను దేశభక్తుడిగా చూపించి విషయం లేదా అనే విషయాన్ని కనపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారని మోడీ కూడా అటువంటి పనులు చేస్తూ ఉంటారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. సోషల్ మీడియాలో కూడా ప్రధానమంత్రి మోడీ విషయ పరిజ్ఞానం పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడేళ్ల కాలంలో ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టకుండా ఆగస్టు 15 కో లేకపోతే గణతంత్ర దినోత్సవం కో జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్టు మోడీ కేవలం జాతిని ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళి పోతూ ఉంటారు. 2018లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణం గురించి తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతు ఉంటే... అదే విధంగా దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటే... మోడీ తన చైర్ లో కూర్చుని నవ్విన నవ్వుల పై చాలామంది విస్మయం వ్యక్తం చేశారు.

మోడీ చేసిన చర్యలను చేస్టలు గా కొన్ని వర్గాల మీడియా కూడా అభివర్ణించింది. అదేవిధంగా సోనియాగాంధీకి ఉన్నటువంటి కళ్ళు ఆర్పే అలవాటుని కూడా మోడీ వెక్కిరించారు. కానీ రాఫెల్ కుంభకోణాన్ని కి సంబంధించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా రాహుల్ గాంధీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు మోడీ. కానీ బిజెపి కార్యకర్తలు ఇచ్చిన కలరింగ్ ముందు మోడీ స్థాయి ఏమిటి రాహుల్ స్థాయి ఏమిటి అంటూ కూడా కొంతమంది ఎద్దేవా చేసి మోడీ వైఫల్యాన్ని పార్లమెంట్లో కవర్ చేసుకోవటం అప్పట్లో కాస్త చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికికూడా రాఫెల్ కుంభకోణాని కి సంబంధించి మోడీ ఎక్కడ కూడా లెక్కలతో మీడియా కు సమాధానం చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: