ఈ రోజు కాంగ్రెస్ భావి ప్రధానమంత్రి అభ్యర్థి, వాయనాడ్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు. సాధారణంగా తండ్రి సర్పంచ్ అయితేనే ఆ కొడుకులు ఊర్లో చేసే రచ్చ మనందరికీ తెలుసు, అలాంటిది రాహుల్ గాంధీ నానమ్మ ప్రధానమంత్రి, తండ్రి స్వయానా ప్రధానమంత్రి స్వయంగా తనకు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సరైన సమయం కాదని తప్పుకున్నాడు కానీ అధికారం కోసం తాపత్రయ పడలేదు. దానికి తోడు తల్లినీ, పార్టీని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడు అనే మరకలు లేవు.


 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అధికారికంగా గాని అనధికారికంగా గాని ఎలాంటి జోక్యం చేసుకోలేదు. స్వయంగా తనను పప్పు అనే ముద్ర వేసి ఒక పార్టీ అంతా టార్గెట్ చేసినా ఎప్పుడు ఆయన మరొకరిని అలాంటి మాటలతో బాధించిన ఘటనలు లేవు. రాజకీయంగా ఎంతో ప్రెజర్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రాజకీయపరమైన విభేదాలను ఎదుర్కొంటున్నారు తప్ప వ్యక్తిగత జీవితాలపై ఇప్పుడు ఆయన ఫోకస్ చేసింది లేదు. అయితే ఇలాంటి వాటికి దగ్గరగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు చేస్తున్న నష్టాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవడంతో ఇప్పుడు వాళ్ళను దూరంగా పెట్టడానికి ఆయన చూస్తున్నాడు. 


కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు ఇప్పుడు తలనొప్పిగా మారారు, కానీ ఒకప్పుడు వాళ్లంతా బలమైన వారు. అలా అని ఇప్పుడు కూడా వారిని భరించాల్సిన అవసరం లేదని చెబుతూ వాళ్ళు ఉంటే తాను అధ్యక్షుడిగా ఉండను అని చెప్పి మరీ తప్పుకున్నాడు రాహుల్గాంధీ.. కాంగ్రెస్ లోకి యువరక్తాన్ని తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక మోడీకి ధీటుగా రాహుల్ గాంధీ అన్ని విషయాల్లోనూ సమాధానాలు చెబుతూ ముఖ్యంగా కరోనా విషయంలో మోడీ ఫెయిల్ అయిన విషయాన్ని కూడా ఎత్తి చూపిస్తూ జనాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: